Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య జ్ఞాపకాలు.. 30 రోజుల్లోనే ఇంట్లోనే విగ్రహం.. ఫైబర్ రబ్బర్‌తో...

Webdunia
శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (14:16 IST)
Madurai Man
తమిళనాడుకు చెందిన సేతురామన్ భార్యపై తనకున్న ప్రేమను నిరూపించారు. మధురైలో వ్యాపారం చేసుకునే సేతురామణ్ భార్య మణియమ్మళ్ ఇటీవలే చనిపోయారు. ఆమె జ్ఞాపకాలు, ఆమెపై ఉన్న ప్రేమను మరిచిపోని సేతురామన్.. భార్య చనిపోయిన 30 రోజుల్లోనే ఆమె విగ్రహాన్ని ఇంట్లో ఏర్పాటు చేశారు. మణియమ్మల్ కూర్చున్నట్లుగా ఉన్న విగ్రహం ఫైబర్ రబ్బర్‌తో రూపొందించారు. ఆ విగ్రహానికి పూజలు చేస్తూ.. ఆమె జ్ఞాపకాలతో సేతురామన్ రోజులు గడిపేస్తున్నారు.  
 
కాగా.. ఇటీవల తాను నూత‌నంగా నిర్మించిన ఇంటి గృహప్రవేశ కార్య‌క్ర‌మానికి.. భార్య‌తో క‌ల‌సి అడుగుపెట్టాల‌నుకున్నాడు. కానీ ఏడాది క్రిత‌మే ఆమె చ‌నిపోయింది. అందుకే ఆమె మైనపు విగ్రహాన్ని తయారుచేయించి.. కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశాడు. కర్ణాటకలో కొప్పల్‌ జిల్లాకు చెందిన శ్రీనివాస్ గుప్తా ఈ శుభ‌కార్యం చేశాడు. త‌న‌ భార్య కొన్నేళ్ల కిందట ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. 
 
ఇటీవల కొత్త ఇంటిని నిర్మించిన అతడు.. గృహప్రవేశంలో భార్య లేని లోటు ఉండకూడదని ఆమె మైనపు విగ్రహాన్ని తయారు చేయించాడు. అచ్చం అతని భార్యను పోలినట్టే ఉన్న విగ్రహాన్ని చూసి చాలామంది చనిపోయిన మనిషి తిరిగొచ్చినట్లు భ్రమపడుతున్నారు. ముఖంలో చిరున‌వ్వుతో జీవ‌క‌ళ ఉట్టిప‌డుతున్న ఆమె విగ్ర‌హాన్ని చూసే అస‌ల‌ది బొమ్మేనా అని ఆశ్చ‌ర్య‌పోతున్నారు.
 
చీర, నగలు, కురులు.. అతి దగ్గరిగా వెళ్లి చూస్తే తప్ప ఆ విగ్రహం అచ్చం మనిషిలాగే కనిపిస్తోంది. ఈ కార్య‌క్ర‌మంలో శ్రీనివాస్ గుప్తా, అతని కూతుళ్లు, బంధుమిత్రులు ఆ బొమ్మతో కలసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రహ్మా ఆనందం నుంచి లిరికల్ సాంగ్ ఆనందమానందమాయే.. రిలీజ్

నేను మీ నాగార్జునను.. ఇరానీ ఛాయ్‌, కరాచీ బిస్కెట్‌, హైదరాబాద్ బిర్యానీ... (Video)

తల్లి లేని ప్రపంచమే లేదు అందుకే కథను నమ్మి తల్లి మనసు తీశా: ముత్యాల సుబ్బయ్య

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments