Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా-ఒమిక్రాన్‌లకు భయపడేది లేదు: జోరుగా జల్లికట్టు పోటీలు

Webdunia
శనివారం, 15 జనవరి 2022 (15:59 IST)
Jallikattu
సంక్రాంతి వచ్చిందంటే తమిళనాడులో జల్లికట్టు పోటీలు జోరుగా సాగుతాయి. ఈ ఏడాది కరోనా కలవరపెడుతున్నా.. ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్నా.. తమిళ తంబీలు బెదురు లేకుండా జల్లికట్టు పోటీల్లో పాల్గొంటున్నారు. పాలమేడు, తిరుచ్చి, అవనీయపురంలో కోడెగిత్తలు రంకెలేస్తున్నాయి. యువకులపై కొమ్ములతో విరుచుకుపడుతున్నాయి. 
 
మదురై జిల్లాలోని అవనియాపురం గ్రామంలో పెద్ద ఈలలు, కరతాళ ధ్వనులు, హర్షధ్వనుల మధ్య, జల్లికట్టు ప్రాంగణంలోకి 300 ఎద్దులను బయటకు పంపారు. తమిళనాడు ప్రభుత్వం 300 ఎద్దులు మరియు 150 మంది ప్రేక్షకులతో జల్లికట్టును అనుమతించింది.
 
ఇక పొట్లగిత్తల దూకుడుతో పలువురికి గాయాలవుతున్నా యువకులు ఏమాత్రం బెదురుకు గురికాలేదు. రంకెలు వేసే బసవన్నల పొగరును అణచివేస్తున్నారు. తమ పౌరుషాన్ని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎద్దును లొంగదీసుకునేందుకు వందలాది యువకులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
 
కానీ ఎవరడ్డు వచ్చినా సరే ఆ రింగులో తిరుగుతూ కొమ్ములతో పొడిచేస్తున్నాయి... ఎద్దులు. మొదలైన కాసేపటికే కొంతమంది యువకులకు గాయాలయ్యాయి. ఇక శుక్రవారం మధురై జిల్లాలో జల్లికట్టులో యువకుడి మృతి చెందారు. మరో 80 మంది గాయపడ్డారు. దీంతో పోటీలకు దగ్గరలో మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేశారు అధికారులు. ప్రాణాలను గాయాలను ఏమాత్రం లెక్కచేయకుండా యువకులు భారీ స్థాయిలో జల్లికట్టులో పాల్గొంటున్నారు.

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments