Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త స్నేహితుడితో అక్రమ లింకు : అడ్డుగా ఉన్నాడని కుమారుడి హత్య..

Webdunia
శుక్రవారం, 26 మార్చి 2021 (14:11 IST)
కట్టుకున్న భర్త స్నేహితుడితో ఏర్పడిన అక్రమ సంబంధానికి అడ్డుగా వున్నాడని భావించిన ఓ మహిళ.. కన్నబిడ్డను హత్య చేసింది. ఈ దారుణ తమిళనాడులోని సేలం జిల్లాలో జరుగగా, ఈ కేసును విచారించిన కోర్టు ఆమెకు జైలుశిక్షను విధించింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే, సేలం జిల్లా అటయాపట్టి ఎస్‌.పాపరాంపట్టికి చెందిన మణికంఠన్‌ భార్య మైనావతి (26). వీరి కుమారులు శశికుమార్‌ (07), అఖిల్‌ (03) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. 
 
ఇదిలావుంటే, మైనావతికి తన భర్త స్నేహితుడు అయిన దేవరాజ్‌ (25) అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరిద్దరూ ఓ రోజు ఇంట్లో ఏకాంతంగా ఉండగా, రెండో కుమారుడైన అఖిల్ చూశాడు. దీంతో తమకు అడ్డుగా ఉన్న కుమారుడిని అడ్డు తొలగించుకోవాలని భావించిన మైనావతి.. అఖిల్‌ను తల్లివద్దకు తీసుకెళ్తున్నట్టు నమ్మించి బావిలో తోసేసింది. 
 
ఆ తర్వాత తన కుమారుడు కనిపించడం లేదని నాటమాడింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో మైనావతిని, దేవరాజ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. 
 
ఈ కేసు విచారణ గురువారం సేలం మహిళా కోర్టులో విచారణకు వచ్చింది. విచారణ అనంతరం కుమారుడిని హత్య చేసిన మైనావతికి సేలం మహిళా కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. అలాగే దేవరాజుకు ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో అతనిని నిర్ధోషిగా విడుదల చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments