నా మొగుడు నిద్రపోయాడు.. ఎక్కడకు రమ్మంటావ్ : ఊరి బయటవుండే పత్తితోటలోకి వచ్చెయ్..

పాలలో భర్తకు మత్తు మాత్రలు కలిపి ఇచ్చిన భార్య.. ప్రియుడి కోసం పత్తితోటలోకి వెళ్లింది. కానీ, పాలు తాగినట్టుగా నటించిన భర్త.. భార్యను వెంబడించి.. వేట కొడవలితో నరికేశాడు. అలాగే, ఆమె ప్రియుడుని కూడా హతమార

Webdunia
శుక్రవారం, 24 ఆగస్టు 2018 (10:41 IST)
పాలలో భర్తకు మత్తు మాత్రలు కలిపి ఇచ్చిన భార్య.. ప్రియుడి కోసం పత్తితోటలోకి వెళ్లింది. కానీ, పాలు తాగినట్టుగా నటించిన భర్త.. భార్యను వెంబడించి.. వేట కొడవలితో నరికేశాడు. అలాగే, ఆమె ప్రియుడుని కూడా హతమార్చాడు. ఈ దారుణం తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడి జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
తూత్తుకుడి జిల్లా ముమ్మలంపట్టి గ్రామానికి చెందిన హరికృష్ణ అనే వ్యక్తి రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈయనకు భార్య తంగమారి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నాడు. 
 
అయితే, భర్త ఉద్యోగానికి వెళ్లుతుండటంతో తంగమారికి అదే ప్రాంతానికి చెందిన రైతు పెరుమాళ్‌తో వివాహేతర సంబధం ఏర్పడింది. ఈ విషయం భర్తతో పాటు.. వారి కుటుంబ సభ్యులకు తెలిసి, తంగమారిని హెచ్చరించారు. అయినా ఆమెలో మార్పురాలేదు. 
 
ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి హరికృష్ణ ఇంటికి వచ్చాడు. అపుడు పాలలో మత్తుమాత్రలు కలిపి భర్తకు భార్య ఇచ్చింది. అయితే, ఆ పాలను తాగినట్టుగా భర్త నటించి కదలకుండా పడుకున్నాడు. దీంతో భర్త నిద్రలోకి జారుకున్నట్టుగా భార్య భావించి వెంటనే తన ప్రియుడు పెరుమాళ్‌కు ఫోన్ చేసింది. 
 
అతను ఊరి బయట ఉన్న పత్తి తోటలోకి రావాలని తంగమారికి సూచించాడు. దీంతో ఇంటి తలుపులు దగ్గరికివేసి ఆమె అక్కడకు బయలుదేరింది. భార్య ప్రవర్తనతో ఆగ్రహానికిలోనైన హరికృష్ణ వేట కొడవలి తీసుకుని వెంబడించాడు. చివరికి వీరిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా దాడిచేశాడు. 
 
ఈ దాడిలో పెరుమాల్ అక్కడికక్కడే చనిపోయాడు. భార్య తంగమారి అక్కడి నుంచి పారిపోతుండగా, హరికృష్ణ వెంటాడి మరీ కొడవలితో నరికాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

మెగా ఆఫర్ కొట్టేసిన మలయాళ బ్యూటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments