Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ ఉద్యోగం వస్తే ప్రాణాలు తీసుకున్నాడు.. అది మొక్కుబడి అట!

Webdunia
ఆదివారం, 1 నవంబరు 2020 (10:45 IST)
కొందరు ప్రభుత్వ ఉద్యోగం వస్తే మొక్కులు చెల్లించుకుంటామని దేవుడిని ప్రార్థిస్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది అంటే ఎగిరి గంతులేస్తూ ఉంటారు. ఇక్కడ మాత్రం సీన్ రివర్స్. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని ఏకంగా ప్రాణాలు తీసుకున్నాడు ఓ వ్యక్తి. 
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని ఏకంగా ప్రాణాలను అర్పించాడు. కన్యాకుమారికి చెందిన 32 ఏళ్ల నవీన్ అనే వ్యక్తి తనకు ప్రభుత్వ ఉద్యోగం వస్తే తన జీవితాన్ని త్యాగం చేస్తాను అంటూ దేవుడికి మొక్కుకున్నాడు. 
 
కొన్ని రోజుల వ్యవధిలోనే ముంబైలోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం సాధించాడు నవీన్. ఇక ఎంతో సంతోష పడి ఉద్యోగంలో చేరి 15 రోజుల పాటు విధులు నిర్వహించి ఆ తర్వాత రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. భగవంతుడికి ఇచ్చిన ముక్కు చెల్లించుకునేందుకు ఆత్మహత్య చేసుకున్నాను అంటూ సూసైడ్ నోట్లో కూడా పేర్కొన్నాడు సదరు వ్యక్తి. ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

తర్వాతి కథనం
Show comments