Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త భార్యతో ముద్దూముచ్చట తీర్చుకుని... ప్రియురాలితో భర్త జంప్

కొత్త భార్యతో నెల రోజుల పాటు ముద్దూముచ్చట తీర్చుకున్న కట్టుకున్న భర్త ఆ తర్వాత ప్రియురాలితో జంప్ అయ్యాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్ళూరు జిల్లా ఆర్కే.పేటలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన

Webdunia
బుధవారం, 27 జూన్ 2018 (10:04 IST)
కొత్త భార్యతో నెల రోజుల పాటు ముద్దూముచ్చట తీర్చుకున్న కట్టుకున్న భర్త ఆ తర్వాత ప్రియురాలితో జంప్ అయ్యాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్ళూరు జిల్లా ఆర్కే.పేటలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
తిరువళ్లూరు జిల్లా పళ్లిపట్టు తాలూకాలోని రంగాపురానికి చెందిన సంపత్‌రెడ్డి కుమార్తె అర్చనాదేవి (21)కి నెల రోజుల క్రితం వేలూరు జిల్లా పుదూరుకు చెందిన తంగరాజుతో వివాహమైంది. ఆమెతో నెల రోజుల పాటు సంసారం చేశాడు. అయితే, అప్పటికే మరో యువతి ప్రేమలో మునిగి తేలుతున్న తంగరాజు తాజాగా ప్రియురాలితో కలిసి పరారయ్యాడు.
 
అవమాన భారం తట్టుకోలేని అర్చన పుట్టింటికి చేరుకుంది. తీవ్ర మానసికక్షోభకు గురైన ఆమె మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నెగటివ్ టాక్, అల్లు అర్జున్ 'పుష్ప కా బాప్' కేక్ కట్

Game Changer: తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా రూ.186 కోట్ల కలెక్షన్స్

నాకు నేనే మహారాజ్ ను అందుకే డాకు మహరాజ్ పెట్టాం : నందమూరి బాలకృష్ణ

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments