Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంబులెన్స్‌కు దారిచ్చిన తమిళనాడు సీఎం స్టాలిన్.. నెటిజన్ల ప్రశంసలు

Webdunia
సోమవారం, 1 నవంబరు 2021 (14:45 IST)
ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజారంజక పాలన సాగిస్తూ, ప్రతి ఒక్కరితో శభాష్ అనిపించుకుంటున్న డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరోమారు ప్రతి ఒక్కరితో శభాష్ అనిపించుకున్నారు. తన కాన్వాయ్‌ను రోడ్డుపక్కకు వెళ్లమని అంబులెన్స్‌ వాహనం వెళ్లేందుకు దారిచ్చారు. ఇది సోషల్ మీడియాతో పాటు టీవీల్లో ప్రసారం కావడంతో ప్రతి ఒక్కరూ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తన చేతలతో మరోమారు ఆయన పెద్ద మనస్సును చాటుకున్నారంటూ కితాబిస్తున్నారు. తన కాన్వాయ్‌ వెళ్తుండగా అంబులెన్స్‌కు దారి ఇచ్చి గొప్పతనాన్ని చాటుకున్నారు స్టాలిన్‌.
 
సోమవారం వేళచ్చేరి మార్గంలో సీఎం కాన్వాయ్ వెళుతుండగా, వెనుక నుంచి ఓ అంబులెన్స్ వేగంగా దూసుకువచ్చింది. ఇది గమనించిన ముఖ్యమంత్రి స్టాలిన్ అప్రమత్తమయ్యారు. వెంటనే స్పందించిన సీఎం వేగంగా వెళ్తున్న ఆ అంబులెన్స్ కోసం ముఖ్యమంత్రి వాహ‌న‌శ్రేణి దారిని ఇచ్చింది. ఎడ‌మ వైపు కాన్వాయ్‌ను ఆపి.. అంబులెన్స్‌కు మార్గాన్ని క‌ల్పించారు. 
 
మార్గమ‌ధ్యంలో కాన్వాయ్‌ను నిలిపివేసి.. అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం స్టాలిన్‌పై తమిళ జనం ప్రశంస‌ల వ‌ర్షం కురుస్తోంది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోను అనేక మంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments