Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిక్ టాక్ వీడియో విడిపోయిన భార్యాభర్తలను కలిపింది.. ఎక్కడ?

Webdunia
గురువారం, 4 జులై 2019 (21:38 IST)
టిక్ టాక్‌తో జీవితాలు బలైన సంఘటనలు చూశాం. కానీ మొదటిసారిగా దంపతులను ఈ యాప్ కలిపింది. తమిళనాడులో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. తమిళనాడు క్రిష్ణగిరికి చెందిన సురేష్, జయప్రద దంపతులకు ఇద్దరు పిల్లలు. అయితే ఇద్దరి మధ్యా మనస్పర్థలు రావడంతో మూడేళ్ళ క్రితం కుటుంబాన్ని వదిలేసి సురేష్ వెళ్ళిపోయాడు. డ్యూటీకి అని చెప్పి అదృశ్యమయ్యాడు. పోలీసులకు జయప్రద ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోయింది.
 
అన్ని ప్రయత్నాలు చేసిన కుటుంబ సభ్యులు..బంధువులు సురేష్ పై ఆశలు వదులుకున్నారు. దీంతో ఇద్దరు పిల్లలతో కలిసి జయప్రద కాలం వెల్లతీస్తోంది. భర్త ఇక రాడనుకుని బతుకుతున్న జయప్రదకు టిక్ టాక్ ఒక వరమైంది. 
 
సురేష్ పోలికలతో టిక్ టాక్ వీడియో చూసిన జయప్రద బంధువు వెంటనే ఆమెకు సమాచారం ఇచ్చాడు. ఆ వీడియోను పంపాడు. అతను తన భర్త సురేష్ అని జయప్రద నిర్థారించుకుంది. వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్ళింది. పోలీసులు రంగంలోకి దిగారు. చివరకు విల్లుపురంలో సురేష్ ను గుర్తించారు. ఓ ట్రాన్స్ జెండర్ మహిళతో కలిసి సురేష్ జీవిస్తున్నట్లు తేల్చారు. 
 
ట్రాన్స్‌జెండర్స్ అసోసియేషన్ సహకారంతో సురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ కలహాలతోనే ఇంటి నుంచి వచ్చేశానని పోలీసులకు సురేష్ చెప్పాడు. ఓ ట్రాక్టర్ కంపెనీలో మెకానిక్‌గా పనిచేస్తున్నట్లు చెప్పాడు. చివరకు అందరికీ కౌన్సిలింగ్ చేసిన పోలీసులు సురేష్, జయప్రదలను ఏకం చేసి ఇంటికి పంపడంతో కథ సుఖాంతమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments