Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళ బుల్లితెర నటుడు ఆత్మహత్య.. భార్యతో విబేధాలే కారణమా?

Webdunia
శనివారం, 20 ఫిబ్రవరి 2021 (12:55 IST)
తమిళ బుల్లితెర నటుడు ఇంద్రకుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన స్నేహితుడి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఇంద్రకుమార్ తన స్నేహితుడిని కలిసేందుకు వెళ్లి అతని ఇంట్లో శవమై కనిపించాడు. ఈ విషయం తెలుసుకున్న నటుడు స్నేహితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఇంద్రకుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించామని, పోలీసులు ఈ విషయాన్ని పరిశీలిస్తున్నారని తెలిపారు. 
 
బుధవారం సాయంత్రం తన స్నేహితులతో కలిసి సినిమా చూసేందుకు వెళ్లిన విషయాన్ని ఇంద్రకుమార్ స్నేహితుడు తెలిపాడు. ఆ తర్వాత తన స్నేహితుడి ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. ఉదయం స్నేహితుడు గది వద్దకు వచ్చేసరికి ఇంద్రకుమార్ తలుపు తీయలేదు.
 
అనంతరం తలుపు తీయగానే తన స్నేహితుడు శవమై కనిపించాడు. ఈ కేసు దర్యాప్తును పోలీసులు ప్రారంభించారు. అయితే, ఆ ప్రాంతం నుంచి ఎలాంటి సూసైడ్ నోట్ అందలేదు. ఇంద్ర కుమార్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక గల కారణం ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తును నిర్వహిస్తున్నారు. పలు తమిళ టెలివిజన్ షోలలో ఆయన నటించారు. ఆ నటుడికి పెళ్లయి, ఒక బిడ్డ కూడా ఉన్నాడు. ఇంద్రకుమార్‌కు అతని భార్యతో విబేధాలున్నాయని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments