Webdunia - Bharat's app for daily news and videos

Install App

జపాన్ ఇంజినీరుపై లైంగికదాడి: 3వారాల్లోనే నిందితుడికి జైలుశిక్ష-మధ్యప్రదేశ్ కోర్టు అదుర్స్

మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు పెచ్చరిల్లిపోతున్నాయి. ఈ నేరాల కింద నిందితులకు శిక్ష పడాలంటే సంవత్సరాల సమయం పట్టక తప్పట్లేదు. అయితే మధ్యప్రదేశ్‌లోని ఛత్రపూర్ జిల్లాలోని ఓ కోర్టు సంచలనం సృష్టించి

Webdunia
సోమవారం, 29 మే 2017 (17:43 IST)
మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు పెచ్చరిల్లిపోతున్నాయి. ఈ నేరాల కింద నిందితులకు శిక్ష పడాలంటే సంవత్సరాల సమయం పట్టక తప్పట్లేదు. అయితే మధ్యప్రదేశ్‌లోని ఛత్రపూర్ జిల్లాలోని ఓ కోర్టు సంచలనం సృష్టించింది. లైంగిక వేధింపుల బాధితురాలికి మూడు వారాల్లోనే న్యాయం చేసింది. నిందితుడు నేరానికి పాల్పడినట్లు నిర్థారించి, రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 
 
వివరాల్లోకి వెళితే.. జపాన్‌కు చెందిన మెకానికల్ ఇంజినీరు (30) ఫిర్యాదుపై మేజిస్ట్రేట్ ఎస్ఎస్ జామ్రా విచారణ జరిపారు. ఖజురహోలోని ఓ టూరిస్టు కేంద్రంలోనూ, అనంతరం ఓ హోటల్‌లోనూ తనపై రామ్ రతన్ సోనీ (26) లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధితురాలు ఆరోపించారు. 
 
ఇంకా బాధితురాలిపై రతన్ సోనీ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు రుజువుకావడంతో అతనికి రెండేళ్ల జైలు, రూ.2వేల జరిమానా విధించినట్లు మేజిస్ట్రేట్ తీర్పు ఇచ్చారు. జరిమానా చెల్లించకపోతే మరో మూడు నెలలు జైలు శిక్ష అనుభవించవలసి ఉంటుందని పేర్కొన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం