Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయన పురుషుడే...! పురుషత్వ పరీక్షల్లో వెల్లడి

Webdunia
గురువారం, 27 నవంబరు 2014 (10:38 IST)
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద పురుషుడేనని పురుషత్వ పరీక్షల్లో తేలింది. తాను ఆరేళ్ల బాలుడులాంటి వాడినని అందువల్ల తనకు పురుషత్వ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదని నిత్యానంద గతంలో కోర్టుకు విన్నవించిన విషయం తెల్సిందే. 
 
అయితే పురుషత్వ పరీక్షల్లో ఆయన ‘ పురుషుడే’ అని నిర్ధారణ అయినట్లు తెలిసింది. పూర్వాపరాలను పరిశీలించిన అనంతరం కేసు విచారణను డిసెంబర్ 3కు వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. 
 
అత్యాచార ఆరోపణలకు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి ఈ ఏడాది సెప్టెంబర్‌లో నిత్యానందకు బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో నిపుణుల సమక్షంలో పురుషత్వ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.
 
దీనికి సంబంధించిన 31పేజీల నివేదిక కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ విభాగం డీఎస్‌పీ లోకేష్ బుధవారం రామనగర్‌లోని సెషన్స్ కోర్టుకు అందించారు. 
 
తాదా ఇదే కేసుకు సంబంధించి ఆయనకు నిర్వహించిన ధ్వని సంబంధ పరీక్షల ఫలితాలు అందాల్సి ఉంది. విచారణ సందర్భంగా నిత్యానందతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఐదుగురు ఆయన శిష్యులు కోర్టుకు హాజరయ్యారు. 
 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు