Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీంలో రియా చక్రవర్తికి ఎదురుదెబ్బ : సీబీఐ చేతికి సుశాంత్ కేసు

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (16:15 IST)
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను పాట్నా నుంచి ముంబైకు మార్చాలన్ని సుశాంత్ ప్రియురాలు, సినీ నటి రియా చక్రవర్తి అభ్యర్థనను సుప్రీకోర్టు తోసిపుచ్చింది. అలాగే, తనకు భద్రత కల్పించాలన్న వినతిని కూడా కోర్టు సమ్మతించలేదు. 
 
కాగా, సుశాంత్ ఆత్మహత్య కేసులో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదనీ, ముంబై సినీ మాఫియా చంపేసిందనీ, ఇందులో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి కిరాయి హంతకురాలు అంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. అందువల్ల సుశాంత్ కేసును సీబీఐతో విచారణ జరిపించాలన్న డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి. 
 
సుశాంత్ మృతి కేసులో పాట్నాలో నమోదైన ఎఫ్ఐఆర్‌ను ముంబైకి బదిలీ చేయాలంటూ రియాచక్రవర్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు కేసును పాట్నా నుంచి ముంబైకి బదిలీ చేయాలన్న అభ్యర్థనను కూడా తిరస్కరించింది. 
 
అలాగే, ఈ కేసు దర్యాప్తునకు సంబంధించి మూడు రోజుల్లో పూర్తి వివరాలు సమర్పించాలని ముంబై పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
 
అలాగే, మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని సంబంధిత పార్టీలను జస్టిస్ హృషికేశ్ రాయ్ సారథ్యంలోని ఏకసభ్య ధర్మాసనం ఆదేశించింది. రియాకు ప్రొటెక్షన్ కల్పించేందుకు కోర్టు నిరాకరించడంతో బీహార్ పోలీసులు ఏ సమయంలోనైనా రియాను ప్రశ్నించే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments