Webdunia - Bharat's app for daily news and videos

Install App

టైమ్ ఇచ్చేది లేదు.. వెంటనే లొంగిపో.. శశికళకు సుప్రీం షాక్.. అమ్మ తరిమేసిన వాడే?

సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో చిన్నమ్మ జైలు కెళ్లడం ఖాయమైన నేపథ్యంలో.. ఆరోగ్యం బాగోలేదని లొంగిపోయేందుకు నాలుగు వారాల గడువు కావాలంటూ కోర్టులో అప్పీల్ చేసుకున్న అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి శశికళకు సు

Webdunia
బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (11:19 IST)
సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో చిన్నమ్మ జైలు కెళ్లడం ఖాయమైన నేపథ్యంలో.. ఆరోగ్యం బాగోలేదని లొంగిపోయేందుకు నాలుగు వారాల గడువు కావాలంటూ కోర్టులో అప్పీల్ చేసుకున్న అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి శశికళకు సుప్రీం నుంచి చుక్కెదురైంది. గడువు పెంచడం కుదరదని వెంటనే లొంగిపోవాలని సుప్రీం స్పష్టం చేసింది. కాగా, అనారోగ్య కారణాలను చూపిస్తూ లొంగిపోయేందుకు నాలుగు వారాల గడువు కావాలని మంగళవారం నాడు శశికళ కోర్టుకు అప్పీల్ చేసుకున్నారు.
 
అప్పీల్‌పై కూడా సుప్రీం ప్రతికూలంగానే స్పందించడంతో శశికళ ముందున్న దారులన్ని ఇక మూసిపోయినట్టే. అదే సమయంలో బుధవారం నాడు శశికళ రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తారన్న అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి. తాజా సుప్రీం తీర్పు నేపథ్యంలో శశికళ లొంగిపోతారా? లేక ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తారన్నది ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం. 
 
ఇదిలా ఉంటే, రూ.66కోట్ల అక్రమాస్తుల కేసులో మంగళవారం నాడు తీర్పు వెలువరించిన సుప్రీం.. శశికళకు నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడడంతో... తమిళనాడు అధికార పార్టీ ఏఐఏడీఎంకే పగ్గాలను అప్పగించడంపై వీకే శశికళ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తన బంధువులైన టీటీవీ దినకరన్, వెంకటేష్‌లను పార్టీలోకి తీసుకువచ్చారు. 
 
గతంలో వీరిద్దరినీ జయలలిత పార్టీ నుంచి సాగనంపగా... తిరిగి వారికే పార్టీ బాధ్యతలు అప్పగించేందుకు శశికళ నిర్ణయించుకోవడం విశేషం. ప్రస్తుతం ఏఐఏడీఎంకే జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్న శశికళ... డిప్యూటీ జనరల్ సెక్రటరీగా దినకరన్‌కు బాధ్యతలు అప్పగించారు. తాను జైలుకెళ్లడం ఖాయం కావడంతో పార్టీపై పట్టునిలబెట్టుకునేందుకే శశికళ తన సోదరి కొడుకైన దినకరన్‌ను రంగంలోకి దించినట్టు సమాచారం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments