Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్జికల్ స్ట్రైక్స్-2: పాకిస్థాన్ సైనిక స్థావరం ధ్వంసం... 40 మంది పాక్ సైన్యం హతం

భారత ఆర్మీ మరోమారు తన ప్రతాపం చూపించింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ వెంబడి ఉన్న నియంత్రణ రేఖకు అత్యంత చేరువకు వెళ్లిన భారత సైన్యం అక్కడి నుంచే పాకిస్థాన్‌ సైన్యానికి చెందిన నాలుగు అతి ముఖ్యమైన స్థావరాలను

Webdunia
శనివారం, 5 నవంబరు 2016 (08:09 IST)
భారత ఆర్మీ మరోమారు తన ప్రతాపం చూపించింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ వెంబడి ఉన్న నియంత్రణ రేఖకు అత్యంత చేరువకు వెళ్లిన భారత సైన్యం అక్కడి నుంచే పాకిస్థాన్‌ సైన్యానికి చెందిన నాలుగు అతి ముఖ్యమైన స్థావరాలను ధ్వంసం చేసింది. పాక్ ఆర్మీకి పీవోకేలో ఉన్న ఒక కీలకమైన కార్యాలయాన్ని పూర్తిగా నేలమట్టం చేయగా, ఈ దాడుల్లో కనీసం 40 మంది పాక్ సైనికులు మరణించినట్లు సమాచారం. అయితే, దీనిపై అటు పాకిస్థాన్ గానీ, ఇటు భారత్ గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. 
 
ఈ దాడులు గత నెల 29వ తేదీన జరిగినట్టు తెలుస్తోంది. భారత జవాన్ మన్‌దీప్ సింగ్‌ తల వేరు చేసి దారుణంగా చంపేయడంపై రగిలిపోయిన భారత ఆర్మీ ఈ తాజా దాడులు జరిపింది. సెప్టెంబర్ నెలలో భారత సైన్యం పీవోకేలోకి ప్రవేశించి చేపట్టిన సర్జికల్ దాడి తర్వాత తీవ్ర ఒత్తిడికి గురైన పాక్ సైన్యం భారత సరిహద్దుల వెంబడి ఉన్న గ్రామాలపై కాల్పులకు తెగబడ్డాయి. మహిళలు, చిన్నారులు, అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లు పలువురు పౌరులు మృత్యువాత పడగా, మరికొంతమంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో భారత్ జరిపిన తాజా దాడులు పాక్ ఆర్మీలో కలకలం రేపాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

'ఆర్ఆర్ఆర్-2'కు "ఎస్" చెప్పిన రాజమౌళి??

నేను గర్భందాల్చానా? ఎవరు చెప్పారు... : శోభిత ధూళిపాల

'శుభం' మూవీ చూస్తున్నంత సేవు కడుపుబ్బా నవ్వుకున్నా... సమంత తల్లి ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments