Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూరత్ కోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురు!

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2023 (12:32 IST)
మోడీ సామాజిక వర్గాన్ని దొంగలతో పోల్చుతూ గత 2019లో జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత, మాజీ మంత్రి పూర్ణేష్ మోడీ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చి రెండేళ్ల జైలుశిక్ష విధించింది. ఆ వెంటనే రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని లోక్‌సభ స్పీకర్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అలాగే, రాహుల్ గాంధీకి ఢిల్లీలో కేటాయించిన అధికారిక బంగ్లాను కూడా ఖాళీ చేయించారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు స్టే విధించాలని కోరుతూ రాహుల్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సూరత్ కోర్టు ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. 
 
ఈ పిటిషన్‌ను దాఖలు చేసేందుకు రాహుల్ గాంధీ ఈ నెల మూడో తేదీన సూరత్ జిల్లా అదనపు సెషన్స్ కోర్టుకు స్వయంగా హాజరయ్యారు. ఆ తర్వాత ఈ పిటిషన్లపై ఈ నెల 13వ తేదీ విచారణ జరిగింది. ఇరు వర్గాల వాదనలు ఆలకించిన కోర్టు.. తీర్పును మాత్రం గురువారానికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో శిక్షపై స్టే విధించేందుకు సూరత్ కోర్టు అంగీకరించలేదు కదా రాహుల్ గాంధీ పిటిషన్‌ను కొట్టివేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments