Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెగాసస్ వ్యవహారంపై నిపుణుల కమిటీ : సుప్రీంకోర్టు వెల్లడి

Webdunia
బుధవారం, 27 అక్టోబరు 2021 (13:20 IST)
దేశంలో పెగాసస్‌ నిఘా వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పలు వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పును వెలువరించింది. పెగాసస్‌ వ్యవహారంపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జస్టిస్‌ ఆర్వీ రవీంద్రన్‌ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ నియమించింది.
 
దేశంలో చట్టబద్ధ పాలన సాగాలన్నదే తమ అభిమతమని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. దేశ పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన స‌రికాద‌ని, ఈ విష‌యాన్ని కోర్టు ఎట్టిపరిస్థితుల్లోనూ సహించజాలదని స్ప‌ష్టంచేసింది. ఈ కేసులో కొందరు పిటిషనర్లు పెగాసస్‌ ప్రత్యక్ష బాధితులని వ్యాఖ్యానించింది. అదేసమయంలో దేశంలో టెక్నాల‌జీ దుర్వినియోగంపై పరిశీలన చేస్తామని పేర్కొంది. 
 
కాగా, సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పెగాస‌స్‌పై వాదనలను విన్న తర్వాత సెప్టెంబరు 13న తీర్పును వాయిదా వేసిన విష‌యం తెలిసిందే. దేశంలోని ప్ర‌ముఖుల ఫోన్లను హ్యాక్ చేసినట్లు వచ్చిన వార్తలపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశాలివ్వాలంటూ పలు వ్యాజ్యాలు దాఖలు కాగా వీటిపై సుప్రీంకోర్టు విచార‌ణ కొన‌సాగించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments