Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్‌ను నిషేధం విధించలేం.. పిల్ కొట్టివేత : సుప్రీంకోర్టు

ఠాగూర్
శుక్రవారం, 15 నవంబరు 2024 (09:45 IST)
దేశంలో వాట్సాప్‌ను నిషేధం విధించలేమని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు నివేదిక రూపంలో తెలిపింది. అలాగే, వాట్సాప్ యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని ఆరోపిస్తూ దానిపై నిషేధం విధించేలా కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలుకాగా, దాన్ని విచారించిన సుప్రీంకోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. 
 
వాట్సాప్‌పై నిషేధం విధించాలని కోరుతూ కేరళకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అక్కడి హైకోర్టును ఆశ్రయించాడు. ఐటీ నిబంధనలు-2021 పాటించడం లేదని ఆరోపించాడు. యూజర్ వైపు మార్పులు చేసే ఆస్కారం ఉందని, సందేశం మూలాలు కనుక్కోవడం కూడా సాధ్యంకాదని పేర్కొన్నాడు. వ్యక్తిగత గోప్యతకు సంబంధించి యూరప్‌లో ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తోన్న వాట్సప్, భారత్‌లో మాత్రం ఇక్కడి చట్టాలను పాటించేందుకు నిరాకరిస్తోందని చెప్పాడు. అయితే, ఇది తొందరపాటు చర్యగా పేర్కొన్న కేరళ హైకోర్టు.. ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది.
 
ఈ విషయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన పిటిషనర్.. పౌరుల ప్రాథమిక హక్కులను వాట్సప్ ఉల్లంఘిస్తోందని, జాతీయ ప్రయోజనాలకు ముప్పుగా మారిందని ఆరోపించాడు. సాంకేతికతను మార్చుకోకుండా, ప్రభుత్వానికి సహకరించకుంటే దేశంలో దీని కార్యకలాపాలను నిషేధించాలని సూచించాడు. ఇటువంటి అనేక వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌లను కేంద్రం నిషేధించిన విషయాన్ని గుర్తుచేశారు. దీనిని పరిశీలించిన జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన సుప్రీం ధర్మాసనం.. ఆ పిల్‌ను కొట్టివేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments