370 అధికరణ రద్దు : సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Webdunia
మంగళవారం, 13 ఆగస్టు 2019 (16:41 IST)
జమ్మూ కాశ్మీరులో సాధారణ పరిస్థితులు మెరుగయ్యేందుకు కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జమ్మూకాశ్మీర్ ‌పరిస్థితి అత్యంత సున్నితమైందని, ఇక్కడ ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. 
 
ఆర్టికల్ 370 రద్దు సమయంలో జమ్మూ కాశ్మీరులో ఆంక్షలు విధించారని సుప్రీంకోర్టులో తెహసీన్ పూనవాల పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టు విచారించింది. జమ్మూ కాశ్మీరులో చోటుచేసుకొన్న పరిస్థితులపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి అరుణ్ మిశ్రా అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ను అడిగి తెలుసుకొన్నారు. 
 
జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలో రోజు రోజుకు పరిస్థితులు మెరుగు పడుతున్నట్టుగా వేణుగోపాల్ కోర్టుకు వివరించారు. ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు కేంద్రం చర్య
లు తీసుకొంటుందని అటార్నీ జనరల్ చెప్పారు. 
 
సాధారణ పరిస్థితులు నెలకొంటే ఆంక్షలు ఎత్తివేస్తామని కోర్టుకు అటార్నీ జనరల్ వివరించారు. 2016లో మూడు మాసాల పాటు ఆంక్షలు విధించిన విషయాన్ని వేణుగోపాల్ గుర్తు చేశారు. ఈ సమయంలో 47 మంది మృత్యు వాత పడ్డారని అటార్నీ జనరల్ సుప్రీంకు తెలిపారు. 
 
జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలో ప్రజల హక్కుల రక్షణకు కేంద్రం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. జమ్మూ కాశ్మీరులో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్రానికి సమయాన్ని ఇవ్వాలని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.
 
ఈ విషయంలో ఇప్పుడే జోక్యం చేసుకోవడం తొందరపాటే అవుతోందని సుప్రీం వ్యాఖ్యానించింది. పరిస్థితుల్లో మార్పులు రాకపోతే అప్పుడు తాము జోక్యం చేసుకొంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments