Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాభర్తల బంధం ఎంతగా బీటలు వారిందో తెలిసిపోతోంది : సుప్రీంకోర్టు

ఠాగూర్
సోమవారం, 14 జులై 2025 (18:19 IST)
భార్యా భర్తల బంధంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యాభర్తల మధ్య వివాహ బంధం ఎలా ఉందో భాగస్వామి ఫోన్ సీక్రెట్ రికార్డింగులు స్పష్టం చేస్తున్నాయని దేశ అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. పంజాబ్ రాష్ట్రంలోని బఠిండాకు చెందిన ఒక వ్యక్తి తన భార్య నుంచి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించడంతో అత్యున్నత న్యాయస్థానం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. 
 
ఇలాంటి కేసుల్లో భాగస్వామి ఫోన్ రికార్డింగ్‌లను సాక్ష్యంగా పరిగణించవచ్చని సుప్రీంకోర్టు వెల్లడించింది. వారి మధ్య వివాహ బంధం బలంగా లేదనే విషయాన్ని ఆ రికార్డింగ్‌లు స్పష్టం చేస్తామని అభిప్రాయపడింది. ఈ వ్యవహారంపై అంతకుముందు పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. 
 
బఠిండాకు చెందిన ఒక వ్యక్తి తన భార్య తన పట్ల క్రూరంగా ప్రవర్తిస్తోందని ఆరోపిస్తూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. అందుకు సాక్ష్యంగా వారి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ రికార్డులను సమర్పించారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ఫ్యామిలీ కోర్టు విడాకుల కేసు విచారణను ప్రారంభించింది. దీనిని ఆమె పంజాబ్ హర్యానా హైకోర్టులో సవాల్ చేసింది. 
 
తనకు తెలియకుండా తన సమ్మతి లేకుండా రికార్డింగ్ చేశాడని, వాటిని సాక్ష్యంగా పరిగణిస్తే తన ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినట్టే అవుతుందని ఆమె హైకోర్టుకు తెలిపారు. ఈ కేసు విచారణ అనంతరం ఆమెకు హైకోర్టు ఊరట లభించింది. దీంతో ఆమె భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 
 
భార్యాభర్తల మధ్య సంభాషణకు సంబంధించిన రికార్డింగ్‌లను సాక్ష్యాలుగా పరిగణిస్తే వైవాహిక బంధాలు ప్రమాదంలో పడతాయని కొందరు చెబుతున్నారని, కానీ భాగస్వాములు ఒకరిపై మరొకరు నిఘా పెట్టే పరిస్థితి వచ్చిందంటే వారి వైవాహిక బంధం ఎంతగా బీటలు వారిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

పరస్పరం విశ్వాసం లేదని అర్థమవుతుందని, అలాంటి వాటిని సాక్ష్యాలుగా పరిగణించవచ్చని తెలిపిందని పేర్కొంటూ హర్యానా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. పైగా, ఈ విడాకుల కేసు విచారణ ఫ్యామిలీ కోర్టులో కొనసాగించవచ్చని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments