బాబ్రీ మసీదు కేసు ఏప్రిల్‌కు వాయిదా... బీజేపీ నేతలకు విముక్తి లభించేనా?

బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి భాజపా నేతలు కుట్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసు విచారణను సుప్రీంకోర్టు రెండు వారాలు వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి అందరినీ లిఖిత పూర్వకంగా నివేదికలు అందించాలని కోర్

Webdunia
గురువారం, 23 మార్చి 2017 (17:22 IST)
బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి భాజపా నేతలు కుట్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసు విచారణను సుప్రీంకోర్టు రెండు వారాలు వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి అందరినీ లిఖిత పూర్వకంగా నివేదికలు అందించాలని కోర్టు ఆదేశించింది. రెండు వారాల తర్వాత కేసు విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. 
 
1992లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి ఎల్కే. అద్వానీ, కేంద్ర మంత్రి ఉమాభారతి, బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీ, వినయ్ కతియార్ సహా 13 మంది భాజపా నేతలపై కుట్ర అభియోగాలను ప్రత్యేక కోర్టు కొట్టేసింది. కింది కోర్టు తీర్పును అలహాబాద్‌ హైకోర్టు సమర్థించింది. దీంతో సీబీఐ ఈ కేసును సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
 
అయితే, సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. కేవలం సాంకేతిక కారణాలతో 13 మంది భాజపా నేతలపై ఉన్న కేసులు తొలగించేందుకు అంగీకరించబోమని, అవసరమైతే కుట్ర ఆరోపణలపై వారు తిరిగి విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని సుప్రీంకోర్టు ఇటీవల వెల్లడించింది. 
 
వాస్తవానికి ఈ కేసులో బుధవారమే కోర్టు తీర్పును వెలువరించాల్సి వుండగా, గురువారానికి వాయిదా వేసింది. అయితే, గురువారం మరోమారు విచారణకు రాగా రెండు వారాల పాటు వాయిదా వేయడం గమనార్హం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments