పోలీసులను ఆశ్రయించిన సుధామూర్తి.. ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 25 సెప్టెంబరు 2023 (10:19 IST)
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య, రచయిత్రి సుధామూర్తి పోలీసులను ఆశ్రయించారు. తన పేరును దుర్వినియోగపరుస్తున్నారంటూ ఆమె ఫిర్యాదు చేసారు. తనకు సంబంధం లేని కార్యక్రమాల్లో తన పేరును ప్రస్తావిస్తూ కొందరు డబ్బు వసూళ్ళకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. ఈ మేరకు సుధామూర్తి తన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌తో పోలీసులకు ఫిర్యాదు చేయించారు. 
 
తమ సంస్థ 50వ వార్షికోత్సవానికి హాజరుకావాలంటూ కన్నడకూట నార్తన్ కాలిఫోర్నియా (కేకేఎన్సీ) వారు గతంలో సుధామూర్తిని ఆహ్వానించారు. తీరిక లేకుండా ఉన్న కారణంగా తాను రాలేనని ఆమె చెప్పారు. కానీ, ఆ కార్యక్రమంలో తాను ముఖ్య అతిథిగా పాల్గొంటున్నట్టు జరుగుతున్న ప్రచారం గురించి సుధామూర్తి దృష్టికి వచ్చింది. 
 
అయితే, లావణ్య అనే మహిళ సుధామూర్తి వ్యక్తిగత కార్యదర్శినని చెప్పి తమను మోసం చేసినట్టు కేకేఎన్సీ వారు పేర్కొన్నారు. మరో ఉదంతంలోనూ సుధామూర్తి పేరును ఓ మహిళ దుర్వినియోగపరిచింది. అమెరికాలో జరిగే ఓ కార్యక్రమానికి ఆమె హాజరవుతారంటూ ప్రచారం చేసింది. 
 
కార్యక్రమానికి హాజరయ్యేందుకు సిద్ధమైన వారి నుంచి 40 డాలర్ల చొప్పున వసూలు చేసింది. ఇక సుధామూర్తి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆమె పేరు చెప్పి మోసాలకు దిగిన మహిళలు ఇండియాలో ఉన్నారా? లేక అమెరికాలో ఉన్నారా? అనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

Vishwak Sen.: విశ్వక్ సేన్.. ఫంకీ థియేటర్ డేట్ ఫిక్స్

Pre-Wedding Show Review: హాయిగా నవ్వుకునేలా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో.. మూవీ రివ్యూ

కేజీఎఫ్ విలన్ హరీష్ రాయ్ ఇకలేరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments