Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి తిరస్కరించినా కన్నేశాడు... లిఫ్టిస్తానని నమ్మబలికి కారులోనే విద్యార్థినిపై అత్యాచారం

పెళ్లి ప్రతిపాదన తిరస్కరించినప్పటికీ... ఆమెపై కన్నేశాడు. లిఫ్టు పేరుతో కారులో ఎక్కించుకుని యమునా ఎక్స్‌ప్రెస్ హైవేకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. గ్రేటర్ నోయాడాలో వెలుగుజూసిన ఈ వివరాలను పరిశీ

Webdunia
గురువారం, 27 ఏప్రియల్ 2017 (11:21 IST)
పెళ్లి ప్రతిపాదన తిరస్కరించినప్పటికీ... ఆమెపై కన్నేశాడు. లిఫ్టు పేరుతో కారులో ఎక్కించుకుని యమునా ఎక్స్‌ప్రెస్ హైవేకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. గ్రేటర్ నోయాడాలో వెలుగుజూసిన ఈ వివరాలను పరిశీలిస్తే.... 
 
నోయిడాలోని ముర్షద్‌పూర్ ప్రాంతంలో నివాసముంటున్న 25 ఏళ్ల బీటెక్ విద్యార్థి నోయిడా ఇంటర్నేషనల్ యూనివర్శిటీ విద్యార్థినిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదించాడు. దానికి ఓ యువతి నిరాకరించింది. 
 
కానీ, ఆ యువతిపై మనసుపడిన ఆ విద్యార్థి.. నోయిడా ఇంటర్నేషనల్ యూనివర్శిటీ గేటు వద్దకు వచ్చి అక్కడ వేచి ఉన్న యువతికి లిఫ్ట్ ఇస్తానంటూ ఎక్కించుకొని యమునా ఎక్స్‌ప్రెస్ హైవే పై నుంచి ఫార్ములావన్ బుద్ధా సర్క్యూట్ రేస్‌ట్రాక్ పైకి తీసుకువెళ్లాడు. 
 
అప్పటివరకు కారులో తనతో ఉన్న ఇద్దరు స్నేహితులను దింపేసి కారు అద్దాలు వేసి యువతిపై అత్యాచారం జరిపాడు. ఈ ఘటనపై యూనివర్శిటీ విద్యార్థిని తోటి స్నేహితురాళ్లు, తల్లిదండ్రులతో కలిసి దన్‌కౌర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత యువతి ఫిర్యాదు మేర ఐపీసీ సెక్షన్ 376 కింద యువకుడిపై కేసు నమోదు చేయగా, నిందితుడు పరారీలో ఉన్నాడు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments