Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరవింద్ కేజ్రీవాల్‌పై స్టింగ్ ఆపరేషన్ : ఎవరు చేశారు.. ఎందుకు చేశారు?

Webdunia
శనివారం, 28 మార్చి 2015 (14:14 IST)
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై స్టింగ్ ఆపరేషన్ చేశారు. పార్టీ నేతల మధ్య ఏర్పడిన విభేదాలే ఆయనపై స్టింగ్ ఆపరేషన్ చేసే స్థాయికి తీసుకొచ్చాయి. పార్టీలో అసమ్మతి నేతలైన ప్రశాంత్‌ భూషణ్, యోగేంద్ర యాదవ్‌‌లతో కలిసి పనిచేయడం కష్టమని ఈ స్టింగ్ ఆపరేషన్‌లో అరవింద్ కేజ్రీవాల్ తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని స్టింగ్ ఆపరేషన్ ఆడియో టేప్‌ యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ విడుదల చేశారు. 
 
వాళ్లిద్దరూ పార్టీలో కొనసాగితే మిగిలిన 66 మంది ఎమ్మెల్యేలతో కొత్త పార్టీని పెట్టుకుంటానని అన్నట్టు రికార్డైంది. ఈ ఆడియో టేప్ విని తాము దిగ్భ్రాంతికి లోనయ్యామని, పార్టీ నుంచి సాగనంపాలని నిర్ణయించుకున్నాక చర్చలతో ప్రయోజనం లేదని వారు స్పష్టం చేశారు. 
 
పార్టీ వ్యవస్థాగత సిద్ధాంతాలు, అంతర్గత ప్రజాస్వామ్యం విషయంలో కేజ్రీవాల్ రాజీపడుతున్నారని ఆరోపించిన వారు, పార్టీ నిర్ణయాల్లో కార్యకర్తల భాగస్వామ్యం పెరగాలని డిమాండ్ చేశారు. కాగా, ఆప్‌లో విభేదాలపై దేశవ్యాప్తంగా అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఆశలతో ఎన్నుకుంటే పార్టీ వ్యవహారాలు ఇబ్బంది కలిగిస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments