Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్కేనగర్ ఎన్నికలు: స్టాలిన్‌ సవాలుకు ధీటుగా స్పందించిన ఓపీఎస్.. డీఎంకేకు ఓటమి భయం?

తమిళనాడు మాజీ సీఎం జయలలిత మృతి చెందడంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ స్థానానికి ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. అన్నాడీఎంకే చీలిపోయాక.. శశివర్గం, ఓపీఎస్ వర్గం, దీప ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. డీఎంకే కూ

Webdunia
గురువారం, 30 మార్చి 2017 (10:15 IST)
తమిళనాడు మాజీ సీఎం జయలలిత మృతి చెందడంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ స్థానానికి ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. అన్నాడీఎంకే చీలిపోయాక.. శశివర్గం, ఓపీఎస్ వర్గం, దీప ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. డీఎంకే కూడా ఎన్నికల బరిలో నిలిచింది. ఈ ఎన్నికల్లో పన్నీర్ మద్దతిచ్చే మధుసూదన్‌కు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. 
 
దీంతో డీఎంకే అధినేత స్టాలిన్‌ ఎక్కువగా పన్నీర్‌ వర్గంపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా జయలలిత మరణం వెనుక రహస్యాలున్నాయి, శశికళ బండారం బయట పెడతాను అంటూ వ్యాఖ్యలు చేసిన పన్నీర్‌ సెల్వం ఆ రహస్యాలు ఏంటి అనేది బయట పెట్టాల్సిందిగా డిమాండ్‌ చేస్తున్నారు. ఆ 90 శాతం నిజాలు ఏంటో బయట పెట్టిన తర్వాతే ఓట్ల కోసం ప్రజల ముందుకు రావాల్సిందిగా స్టాలిన్‌ సవాలు విసిరారు.
 
అయితే స్టాలిన్ వ్యాఖ్యల పట్ల పన్నీర్ సెల్వం ఘాటుగా స్పందించారు. డీఎంకే ఓటమి భయంతో ఇలా మాట్లాడుతుందన్నారు. 2006వ సంవత్సరంలో తనను అమ్మకు శశికళ దూరం చేయాలని చూసిందని.. అందుకు సంబంధించినవే ఆ 90 శాతం నిజాలంటూ సెల్వం వివరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga vamsi: లోక చాప్టర్ 1: షోలు రద్దు కావడం వల్ల నిర్మాత నాగ వంశీకి లాభమా నష్టమా?

నాగార్జున ఇప్పటికీ ఎంతో హ్యాండ్సమ్‌గా ఉంటారు : కమిలినీ ముఖర్జీ

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments