Webdunia - Bharat's app for daily news and videos

Install App

అస్సాంలో కూలిన వేదిక.. క్రీడల మంత్రి సహా బీజేపీ నాయకులకు గాయాలు

Webdunia
సోమవారం, 6 జులై 2015 (19:52 IST)
అసోంలో బీజేపీ నిర్వహిస్తున్న ఓ సభావేదిక ఉన్నపళంగా కుప్పకూలింది. దీంత వేదికపై ఉన్న 15 మంది గాయపడ్డారు. ఈ సంఘటనలో కేంద్ర క్రీడాశాఖమంత్రి సర్బానంద సోనోవాల్ గాయాలపాలయ్యారు. వారిలో కొందరికి మోస్తరు గాయాలుకాగా మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. 
 
అసోంలోని బీజేపీ అనుభంద శాఖ అయిన బీజేపీ యువ మోర్చా (బీజేవైఎం) కార్యకర్తలు సోమవారం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసింది. 25 మంది అతిథులు ఆశీన్నులయ్యేలా డయాస్ను ఏర్పాటు చేసింది. దీనికి కేంద్ర క్రీడాశాఖ మంత్రి సర్బానంద సోనోవాల్, బీజేపీ సీనియర్ నేత ఉజ్వల్ కశ్యప్, ఎంపీలు కామాఖ్య ప్రసాద్, రామేశ్వర్ తేలి హాజరయ్యారు. 
 
అయితే, ఒక్కసారిగా డయాస్ మీదకు పరిమితికి మించి రెట్టింపుగా దాదాపు 150 మంది ఎక్కారు. వీరంతా కార్యక్రమానికి వచ్చిన కేంద్ర క్రీడాశాఖ మంత్రి సర్బానంద సోనోవాల్కు అభినందనలు తెలిపేందుకు ఎగబడ్డారు. దాంతో అది ఒక్కసారిగా కుప్పకూలి స్వల్ప గాయాలపాలయ్యారు. వెంటనే అక్కడికి వైద్యులు చేరుకొని ప్రథమ చికిత్సలు అందించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments