Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైల్లో శశికళకు రాజభోగాలు.. ప్రత్యేక వంటగది.. జైళ్ల అధికారికి 2 కోట్ల ముడుపులిస్తే శాంక్షన్

అన్నాడీఎంకే దివంగత సీఎం జయలలిత స్నేహితురాలు శశికళకు కర్ణాటక జైలులో లభిస్తున్న ప్రత్యేక సౌకర్యాలకు సంబంధించిన వార్త గుప్పుమంది. అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస

Webdunia
గురువారం, 13 జులై 2017 (13:29 IST)
డబ్బున్న వాళ్లకు ఒక న్యాయం లేనివాల్లకు అన్యాయం ఈ దేశంలో రాజ్యాంగ వ్యవస్థల్లో అడుగడుగునా అమలవుతోందని ఎన్నో ఉదాహరణలు లభ్యమవుతూనే ఉన్నాయి. కానీ మనకు మన రాజ్యాంగం  అంటే ఎనలేని పవిత్ర భావం మరి. వివక్షలకు, అన్యాయాలకు సంబంధించిన ఎన్ని వార్తలు మనం చూస్తున్నా మన మూలాలను ప్రశ్నించడానికి మాత్రం ఒప్పుకోం.
 
తాజాగా అన్నాడీఎంకే దివంగత సీఎం జయలలిత స్నేహితురాలు శశికళకు కర్ణాటక జైలులో లభిస్తున్న ప్రత్యేక సౌకర్యాలకు సంబంధించిన వార్త గుప్పుమంది. అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక వంటగది వసతి కల్పించారని, ఇంకా అక్కడ అనేక అక్రమాలు జరుగుతున్నాయని స్పష్టమవుతోంది. 
 
కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీ రూప ఆ శాఖ డీజీపీ సత్యనారాయణకు జైలులోని అక్రమాలపై లేఖ రాయడంతో ఈ విషయాలు వెలుగు చూశాయి. ఆరుపేజీలతో కూడిన ఈ లేఖ జైళ్లశాఖలో కలకలం రేపుతోంది. శశికళకేగాక పలువురు ఖైదీలకూ ఇదే విధమైన వసతి లభిస్తోందని రూప తన లేఖలో తెలిపారు. శశికళకు జైల్లో అక్రమంగా సౌకర్యాలు కల్పించినందుకు ఒక జైళ్లశాఖ ఉన్నతాధికారికి రూ.2 కోట్ల ముడుపులు దక్కినట్లు తేలింది. 
 
మన దేశ జైళ్లలో డబ్బులు పడేస్తే చాలు ఏమయినా  జరుగుతుందని అర్థం కావడానికి ఇంకా సందేహమా?
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా డాడీ మనస్తత్వాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాం : నారా బ్రాహ్మణి

అలనాటి నటి పుష్పలత కన్నుమూత..

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments