Webdunia - Bharat's app for daily news and videos

Install App

నలుగురు గ్యాంగ్‌స్టర్‌లను పెళ్లాడిన లేడీ డాన్... బ్యాడ్ బాయ్స్ అంటే ఇష్టమట...

Webdunia
శుక్రవారం, 25 జనవరి 2019 (09:01 IST)
ఢిల్లీలో వ్యభిచార దందాను నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడిన లేడీ డాన్ సోనూ పంజాబన్ అలియాస్ గీతా అరోరా. ఈమె ఏకంగా నలుగురు గ్యాంగ్‌స్టర్లను పెళ్ళాడింది. ఆ నలుగురు చివరకు ఎన్‌కౌంటర్‌లో హతంకావడం ఆమె విధిరాత. అయితే, ఈ లేడీ డాన్ జీవితంలోకి నలుగురు గ్యాంగ్‌స్టర్‌లు ఏ విధంగా ప్రవేశించారో పరిశీలిద్దాం.
 
ఢిల్లీకి చెందిన సోనూ... మంచి అందగత్తె. తన అందంతో హై ప్రొఫైల్ వ్యాపారవేత్తలకు వలవేసి, వారిని వ్యభిచారానికి ప్రోత్సహించేది. అలా వ్యభిచారాన్ని తన ప్రధాన వృత్తిగా ఎంచుకుంది. ఈ క్రమంలో ఆమె ఓ గ్యాంగ్‌స్టర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ అతను పోలీస్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. ఆ తర్వాత మరో గ్యాంగ్‌స్టర్.. అతనూ ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయాడు. ఇలా ఏకంగా నలుగురు గ్యాంగ్‌స్టర్‌లను ఆమె పెళ్లి చేసుకోగా వారంతా ఎన్‌కౌంటర్‍లోనే ప్రాణాలు కోల్పోయాడు. 
 
దీంతో కొన్నేళ్ళపాటు చీకటి రాజ్యంలో గడుపుతూ.. వ్యభిచార దందాను కొనసాగిస్తూ వచ్చింది. ఆ తర్వాత ఇదే కేసులో అరెస్టు కావడం, విడుదలకావడం పరిపాటిగా మారిపోయింది. ప్రధానంగా సినిమా, మోడలింగ్‌ రంగంలోకి రావాలని ఆశపడే యువతులను వలవేసి గీతా వ్యభిచారదందాలోకి దించేది. ఈ అందమైన అమ్మాయిలతో ఎంజాయ్ చేసేందుకు హైప్రొఫైల్‌ వ్యాపారవేత్తలు సహా అనేక మంది ప్రముఖులు ఆమె కస్టమర్లుగా ఉన్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. 
 
పైగా, ఈమెకు 'బాడ్‌ బాయ్స్' అంటే మహాయిష్టమట. కానీ తన జీవితంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ చనిపోయారని పోలీసులు చెప్పారు. మొదట గ్యాంగ్‌‌స్టర్‌ హేమను పంజాబన్ పెళ్లి చేసుకుంది. పోలీసుల ఎన్‌‌కౌంటర్‌‌లో హేమను మృతి చెందాక తన పేరులో సోనూ చేర్చుకుంది. ఆ తర్వాత మరో గ్యాంగ్‌‌స్టర్‌ విజయ్‌ సింగ్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరూ పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే 2003లో గర్హ్‌ ముక్తేశ్వర్‌ ప్రాంతంలో సింగ్‌ను ఉత్తరప్రదేశ్‌ ఎస్.టి.ఎఫ్. పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. 
 
ఆ పిమ్మట మరో బాయ్‌‌ఫ్రెండ్‌ దీపక్‌ కూడా అస్సోంలో పోలీసుల చేతిలో హతమయ్యాడు. ఆ తర్వాత దీపక్‌ తమ్ముడు హేమంత్‌ సోనూ పంజాబన్‌‌కు ఆసరాగా నిలిచాడు. కొద్ది రోజులకు వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ ఓ హైప్రొఫైల్‌ జంట హత్యల కేసులో హస్తమున్న హేమంత్‌‌ను 2006లో ఢిల్లీ-గురుగ్రామ్‌‌లో స్పెషల్‌ సెల్‌ పోలీసులు ఎన్‌‌కౌంటర్‌ చేశారు. ప్రస్తుతం తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారనీ, అందువల్ల తనకు రక్షణ కల్పించాలని ఆమె పోలీసులను కోరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్' చిత్ర ట్రైలర్ విడుదల

'స్వప్నాల నావ'.. సిరివెన్నెల సీతారామశాస్త్రికి అంకితం : దర్శకుడు వి.ఎన్.ఆదిత్య

'డాకు మహారాజ్‌' మనందరి సినిమా.. ఆదరించండి : నిర్మాత నాగవంశీ

పవన్ కళ్యాణ్ వున్నా, రామ్ చరణ్ వున్నా మూలాలు చిరంజీవిగారే: పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్

తండేల్ నుంచి శివ శక్తి సాంగ్ నమో నమః శివాయ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments