Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనియా గాంధీ తప్పుకుని.. రాహుల్ వస్తే మంచిది: దిగ్విజయ్

Webdunia
శనివారం, 1 నవంబరు 2014 (14:52 IST)
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి సోనియాగాంధీ ఇక తప్పుకుంటే మంచిదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్‌సింగ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ పగ్గాలను రాహుల్ గాంధీకి అప్పగించి సోనియా గాంధీ పక్కకు తప్పుకోవాలని ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు.
 
కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలకు సిద్దం అవుతున్న తరుణంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 
 
ఓటమిలను, ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న పార్టీని పునరుత్తేజితం చేయాల్సిన బాధ్యత రాహుల్ మీద ఉందని, అందుకు సమయం కూడా ఆసన్నమైందని దిగ్విజయ్ అభిప్రాయపడ్డారు.రాహుల్ పార్టీ అధ్యక్షుడు అయ్యేందుకు ఇంకా సమయం ఆసన్నం కాలేదన్న వాదనలను ఆయన ఖండించారు.
 
కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమం ప్రస్తుతం సాగుతోంది. అది ఈ ఏడాది చివరకు పూర్తవుతుంది. 2015లో పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలోనే దిగ్విజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌కు ఇంతకు మించి మంచి తరుణం దొరకబోదని దిగ్విజయ్ పేర్కొన్నారు.

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments