Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనియా రాజకీయ అస్త్ర సన్యాసం... పార్టీ పగ్గాలు ప్రియాంకా గాంధీకి? రాహుల్ పరిస్థితేంటి?

ఉత్తప్రదేశ్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకోనున్నారు. అదేసమయంలో పార్టీ పగ్గాలను పార్టీ ఉపాధ

Webdunia
బుధవారం, 25 జనవరి 2017 (09:12 IST)
ఉత్తప్రదేశ్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకోనున్నారు. అదేసమయంలో పార్టీ పగ్గాలను పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కాకుండా సోదరి ప్రియాంకా గాంధీకి అప్పగించే సూచనలు ఉన్నట్టు సమాచారం. 
 
ముఖ్యంగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో సోనియా పోటీ చేయకుండా రాజకీయాల నుంచి పూర్తిస్థాయిలో నిష్క్రమించాలని భావిస్తున్నారు. అదేసమయంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలీ నియోజకవర్గం నుంచి ఇకపై కుమార్తె ప్రియాంకాగాంధీ పోటీ చేయనున్నారు. 2019లో ప్రియాంకా రాజకీయ అరంగేట్రానికి పూర్వరంగం సిద్ధమైందని, ఇకపై యూపీ కాంగ్రెస్‌ వ్యవహారాలన్నింటినీ ప్రియాంకే పర్యవేక్షిస్తారని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.
 
కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్న సోనియాగాంధీ రాజకీయ సన్యాసం చేస్తారని, పార్టీ బాధ్యతలను రాహుల్‌, ప్రియాంకలకు అప్పగించాలనుకున్నారని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. నిజానికి యూపీ సీఎం అభ్యర్ధిగా ప్రియాంకాగాంధీనే ప్రకటించాలని తొలుత భావించినా కాంగ్రెస్‌ పార్టీ విజయావకాశాలు చాలా తక్కువగా ఉన్నాయంటూ సర్వేలు తేల్చడంతో విరమించుకున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

మురారికి దేవకి నందన వాసుదేవకి చాలా వ్యత్యాసం వుంది : డైరెక్టర్ అర్జున్ జంధ్యాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments