Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీని వీడితేనే ప్రాణాలతో ఉండగలరు... సోనియాకు వైద్యుల సలహా?!

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2020 (15:29 IST)
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి వైద్యులు గట్టి హెచ్చరిక చేశారు. తక్షణం ఢిల్లీని వీడాలని ఆమెకు సూచించారు. లేనిపక్షంలో తీవ్ర అనారోగ్యానికి గురవుతారని హెచ్చరించినట్టు సమాచారం. ప్రస్తుతం ఢిల్లీలో వాయు కాలుష్యం తారా స్థాయికి చేరుకుంది. నానాటికీ గాలిలో నాణ్యత నానాటికీ క్షీణించిపోతోంది. ఈ కాలుష్యం వల్ల ఆమెకు ఛాతి ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదముందని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. అందుకే తక్షణం ఢిల్లీని వీడాలని వైద్యులు సలహా ఇచ్చినట్టు కాంగ్రెస్ వర్గాల సమాచారం. 
 
నిజానికి సోనియా గాంధీ కొంత కాలంగా ఛాతి ఇన్‌ఫెక్షన్‌తో బాధడుతున్నారు. అలాగే, ఆమె కేన్సర్‌కు కూడా మందులు వాడుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలో గత జూలై నెల 30వ తేదీన గంగారాం ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత సెప్టెంబరు మాసంలో సాధారణ వైద్య పరీక్షల నిమిత్తమై కొన్ని రోజుల పాటు ఆమె విదేశాలకు వెళ్లారు. అప్పటి నుంచి ఆమె వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో ఢిల్లీలోని కాలుష్యం కారణంగా ఉబ్బసం వచ్చే అవకాశం ఉందని, అంతేకాకుండా ఛాతి నొప్పి కూడా తీవ్రతరం అయ్యే అవకాశాలున్నాయని, అందుకే ఇతర ప్రాంతానికి మకాం మార్చాలని సోనియాకు వైద్యులు సూచించారు. ఈ సూచనలతో సోనియా గోవా లేదా చెన్నైకి వెళ్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సోనియాతో పాటు రాహుల్ లేదా ప్రియాంక కూడా వెళ్లనున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manoj: మిరాయ్ చూశాక ఆనందభరితమైన మంచు మనోజ్ తల్లి నిర్మాలాదేవి

Mirai Review: తేజ సజ్జ, మంచు మనోజ్ ల మిరాయ్ చిత్రంతో అనుకుంది సాధించారా.. రివ్యూ

Jabardasth Comedian: వైల్డ్ కార్డ్ ఎంట్రీ- బిగ్‌బాస్ జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది

ఫిల్మ్‌ఫేర్ గ్లామర్- స్టైల్ అవార్డ్స్ 2025తో బ్లెండర్స్ ప్రైడ్

Emraan Hashmi: పవన్ కళ్యాణ్ ఓజీ నుండి థమన్ స్వరపరిచిన ఓమి ట్రాన్స్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coconut Milk: జుట్టు ఆరోగ్యానిరి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

తర్వాతి కథనం
Show comments