సోనియా గాంధీకి ఏమైంది... వైద్యుల పర్యవేక్షణలో చికిత్స!!

ఠాగూర్
సోమవారం, 16 జూన్ 2025 (17:19 IST)
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (78) అనారోగ్యంబారినపడ్డారు. దీంతో ఆమెకు వైద్యుల పర్యవేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతుండగా, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 
 
ఆదివారం రాత్రి సోనియా గాంధీకి నలతగా ఉండటంతో ఆమె వ్యక్తిగత సిబ్బంది వెంటనే స్పందించి హుటాహుటిన ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రికి తరలించారు. వాస్తవానికి గత కొంతకాలంగా ఆమె ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఆమెను ఆస్పత్రిలో సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో చేర్పించినట్టు గంగారామ్ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ వెల్లడించారు.
 
సోనియా గాంధీ ఉదర సంబంధిత సమస్య కారణంగా ఆదివారం రాత్రి ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. వైద్యుల బృందం ఆమె ఆరోగ్యాన్ని నిశితంగా పర్యవేక్షిస్తోంది అని డాక్టర్ అజయ్ స్వరూప్ సోమవారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు. వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఆమెకు అవసరమైన చికిత్స అందిస్తున్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments