Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనీమూన్‌లో భర్త హత్య : భార్య ప్రియుడిని అరెస్టు చేసిన పోలీసులు

ఠాగూర్
సోమవారం, 9 జూన్ 2025 (17:01 IST)
హనీమూన్‌లో తన భర్త రాజా రఘువంశీని హత్య చేసిందన్న ఆరోపణలతో అరెస్టు అయిన సోనమ్ రఘవంశీ కేసులో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్య తాను చేయలేదని, తనను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ బోరున విలపిస్తోంది. అయితే, ఈ కేసుకు సంబంధించిన పోలీసులు మాత్రం సోనమ్ ప్రియుడు రాజ్ కుశ్వాహా‌ను అదుపులోకి తీసుకున్నారు.
 
పోలీసుల కథనం మేరకు.. ఈ హత్యతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత గాజీపూరి్‌లో వదిలేసి వెళ్లిపోయారు. అక్కడి నుంచే నేను మా కుటుంబ సభ్యులకో ఫోన్ చేసి విషయం చెప్పాను అని సోనమ్ వివరించినట్టు సమాచారం. గాజీపూర్‌లోని ఒక హోటల్ వద్ద నుంచే పోలీసులు సోనమ్‌ను అరెస్టు చేశారు. ఆమె తన ఫోను నుంచే కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టు హోటల్ సిబ్బంది కూడా ధృవీకరించారు. 
 
ఇదిలావుంటే ఈ హత్య కేసులో సోనమ్‌తో సన్నిహితంగా ఉంటున్నాడని భావిస్తున్న రాజ్ కుశ్వాహా అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇండోర్‌కు చెందిన చెందిన కుశ్వాహా, సోనమ్ సోదరుడు నడుపుతున్న ఒక కంపెనీలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. కొంతకాలంగా సోనమ్‌తో రాజ్ కుశ్వాహాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అతని ప్రణాళిక ప్రకారమే ఆమె తన భర్తను హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments