ముంబై : ముంబై నగరం పట్ల తమకున్న ప్రేమ మరియు కృతజ్ఞతను చాటుకుంటూ, రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన శ్రీమతి నీతా మరియు శ్రీ ముఖేష్ అంబానీ ముంబై నగరం కోసం మరియు 20 మిలియన్ల ముంబైకర్ల కోసం ‘ధీరుభాయ్ అంబానీ స్వ్కేర్’ను నగరానికి, దేశానికి అంకితం చేశారు. ముంబై బాంద్రా కుర్ల కాంప్లెక్స్‌లోని ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌కు ఎదురుగా ఉన్న ప్రపంచ శ్రేణి బహుళ విధ వినియోగవేదిక జియో వరల్డ్ సెంటర్‌లో ధీరుభాయ్ అంబానీ స్వ్కేర్ ఒక భాగం.
భారతదేశంలోనే అతిపెద్ద మరియు అత్యుత్తమమైన కన్వెన్షన్ సదుపాయాలు అందించగలిగిన కేంద్రంగా తీర్చిదిద్దాలన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంఎంఆర్‌డీఏ) ఉమ్మడి లక్ష్యంతో జియో వరల్డ్ సెంటర్ రూపుదిద్దుకుంది.
ఈ కేంద్ర్రాన్ని జాతికి అంకితం ఇచ్చిన సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు మరియు చైర్‌పర్సన్ శ్రీమతి నీతా అంబానీ మాట్లాడుతూ, ``ధీరుభాయ్ అంబానీ స్వ్కేర్ మరియు జియో వరల్డ్ సెంటర్ భారతదేశం గర్వించదగిన ముద్దుబిడ్డ యొక్క దూరదృష్టి ఫలితం. భారతదేశ జాతి నిర్మాణంలో భాగంగా ప్రతి ఒక్క అంశంలో ప్రపంచ శ్రేణి సత్తాను చాటే శక్తిసామర్థ్యాలను మనదేశానికి ఉందని నమ్మిన వ్యక్తి యొక్క కృషి ఫలితం.`` అని వెల్లడించారు.
భారతదేశం యొక్క అతిపెద్ద దాతృత్వ సంస్థ రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా శ్రీమతి నీతా అంబానీ విద్య మరియు చిన్నారుల సంక్షేమానికి సంబంధించిన అనేక గొప్ప లక్ష్యసాధనాలను ఆచరణలో చూపించారు. ఆయా కార్యక్రమాలను తమదైన విశిష్ట రీతిలో ఆమె ముందుకు నడిపించారు. చిన్నారులే రేపటి భారతదేశ నిర్మాతలే భావనను బలంగా నమ్మి, ధీరుభాయ్ అంబానీ స్వ్కేర్‌లో నిర్వహించబోయే మ్యూజికల్ ఫౌంటెయిన్‌కు రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా మద్దతు అందించబడిన వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా దాదాపు 2000 మందికి పైగా నిరుపేదలకు చెందిన విద్యార్థులకు ఆమె ఆహ్వానం అందించారు. ఈ మ్యూజికల్ ఫౌంటెయిన్ యొక్క గొప్ప అంశంగా రెండు సుప్రసిద్ధ గీతాలైన `వందేమాతరం` మరియు `జయహో`లను వాటర్ ఫౌంటేయిన్ యొక్క లయబద్దమైన కదలికలకు అనుగుణంగా ఆకట్టుకునే రీతిలో కలిసిపోవడం పేర్కొనవచ్చు.
``ఈ అద్భుతమైన ఫౌంటేయిన్ మీ హృదయాంతరాలలో సంతోషం మరియు విశ్వాసం యొక్క స్థితిని ద్విగుణీకృతం చేస్తుందని మేం విశ్వసిస్తున్నాం`` అని శ్రీమతి నీతా అంబానీ వెల్లడించారు. ``రాబోయే రోజుల్లో, ఫౌంటేయిన్ ముంబైకర్లకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణమైన మరియు బహుళవిధ ప్రయోజనకారి అయిన జియో వరల్డ్ సెంటర్‌లోని ఈ స్వ్కేర్ ఈ అధునాతనమైన మరియు భవిష్యత్ ముఖచిత్రాన్ని చాటే సందర్శకుల ఆదరణ పొందనుంది. ఈ సంవత్సరం చివరి వరకు తెరిచి ఉండనున్న జియో వరల్డ్ సెంటర్‌లో ప్రజలు ఒకరితో మరొకరు అనుసంధానం కాగలరు, కళను ప్రశంసించగలరు, తమ అభిప్రాయాలను పంచుకోగలరు, సంస్కృతిని ప్రశంసించుకోవడం, గొప్ప వారసత్వం మరియు ముంబై నగరం యొక్క వైభవాన్ని చాటిచెప్పుకోగలరు`` అని ఆమె వివరించారు.
అనాధ మరియు వృద్ధాశ్రమాలలో ప్రతిరోజూ అన్నసేవ
తమ కుమారుడు ఆకాశ్ అంబానీ వివాహం శ్లోకా మెహతాతో జరగనున్న నేపథ్యంలో శ్రీమతి నీతా అంబానీ మరియు శ్రీ ముఖేష్ అంబానీ దంపతులు నగరంలోని అనాధశరణాలయాలు మరియు వృద్ధాశ్రమల్లో వారంపాటు సాగే ఉచిత అన్నదాన సేవను ప్రారంభించారు. ఈ కార్యాచరణ జియోగార్డెన్స్‌లో అంబానీ కుటుంబ సభ్యులు, శ్లోకా కుటుంబ సభ్యులైన మోనా మరియు రసెల్ మెహతా సమక్షంలో దాదాపు 2000 మంది చిన్నారులకు భోజనం వడ్డించడం ద్వారా ప్రారంభించారు. ఈ చిన్నారులు రిలయన్స్ ఫౌండేషన్‌కు చెందిన అనేక అభివృద్ధి కార్యక్రమాల లబ్ధిదారులు. అందరికి విద్య, అందరికి క్రీడలు, ప్రాజెక్ట్ దృష్టి మరియు ఇతర అంశాల్లో భాగస్వామ్యులు.
ఈ సందర్భంగా శ్రీమతి నీతా అంబానీ మాట్లాడుతూ, `` మా సంతోషకరమైన సందర్భంలో, ముంబై నగర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది చిన్నారులు మరియు వయోవృద్ధుల ఆశిస్సులు పొందాలని ఆకాంక్షిస్తున్నారు. ధీరుభాయ్ అంబానీ స్వ్కేర్ వద్ద నిర్వహించే ఈ ప్రత్యేకమైన మ్యూజికల్ ఫౌంటేయిన్ ప్రోగ్రాం ద్వారా, ముంబై నగరం యొక్క వైభవాన్ని చాటిచెప్పనుంది.
వివాహం అనంతరం అనేక ప్రదర్శనలు నిర్వహించి మనల్ని ప్రతిరోజూ గర్వకారణంగా నిలుపుతున్న మన పోలీసులు, మన మిలిటరీ మరియు పారామిలిటరీ దళాలు, మన అగ్నిమాపక దశాలు, మన బృహన్ ముంబై కార్మికులు మరియు ఇతరుల ఎందరో మన ముంబై నగరం 24x7 సురక్షితంగా ఉండేందుకు మరియు దినదినం అభివృద్ధి చెందేందుకు సహకరిస్తున్న వారిని కీర్తించనున్నాం`` అని వెల్లడించారు. వారం రోజుల పాటు సాగే ఈ అన్నసేవతో పాటుగా నగరంలోని అన్ని అనాథ శరణాలయాలు మరియు వృద్ధాశ్రమాలకు సంవత్సరం పాటు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం కూడా ఉండనుంది.