విమానాల నిర్వహణ అనేది బస్టాండుల్లో బస్సుల కంటే హీనంగా దిగజారిపోయిందా అంటే అవుననే చెప్పాల్సి ఉంటుంది. బస్సు అద్దం పగిలిపోయింది. టైర్ పంక్చర్ అయిపోయింది. అందుకే ఆపేశాం, ఎప్పుడు రెడీ అవుతుందో చెప్పలేం అనే రకం ఫిల్తీ సమాదానాలు విమాన సంస్థ నుంచి వస్తే వినేవారికి కంపరమెత్తదా? పైలట్ అలిగితే విమానం ఆగుతుంది. అద్దం పగిలితే గంటలపాటు ఆగిపోతుంది. సిబ్బందికి కోపం వస్తే విమానం ఆగిపోతుంది. గగన ప్రయాణాన్ని అద్భుత స్థాయికి తీసుకెళ్లిన విమాన కంపెనీలు కనీస జాగ్రత్తలు తీసుకెళ్లడంలో విఫలమవుతున్నాయా. స్పేస్ జెట్ వ్యవహారం చూస్తుంటే నిజమేననిపిస్తుంి.
పైలట్ పక్కనే ఉన్న అద్దం స్వల్పంగా పగిలినట్లు ముందస్తుగా గుర్తించడంతో ఆ స్సైస్ జెట్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. దీంతో అప్పటికప్పుడు విమానాన్ని ఆపేసి మరమ్మత్తు పూర్తి చేసి తొమ్మిదిగంటలు ఆలస్యంగా ఆ విమానం ఎగిరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ పరిస్థితి ఢిల్లీకి చెందిన స్పైస్ జెట్ విమానానికి ఎదురైంది. లోహెగావ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి స్పైస్ జెట్‌కు చెందిన విమానం ఉదయం 7.20గంటలకు ఢిల్లీకి బయలుదేరాల్సి ఉంది.
అయితే, ముందస్తు తనఖీలో భాగంగా పైలట్ సీటుపక్కనే ఉన్న కిటికీ అద్దం పగిలి ఉండటం గుర్తించారు. దీంతో దానికి తిరిగి కొత్త అద్దాన్ని ఫిక్స్ చేసిన తర్వాత సాయంత్రం 4.25 గంటల ప్రాంతంలో విమానానికి అనుమతిచ్చారు. ‘పుణె నుంచి ఢిల్లీ మధ్య నడిచే ఎస్‌జీ999 స్పైస్ జెట్ విమానం బయలుదేరడానికి కాస్త ముందుగా పైలట్ పక్కనే ఉండే కిటికీ అద్దం కొంచెం పగిలి ఉండటం గమనించాం. దీంతో విమానాన్ని ఆపేసి తొమ్మిదిగంటలు ఆలస్యంగా పంపించాం’ అని స్పైస్ జెట్ ఒక ప్రకటనలతో తెలిపింది.
మొత్తం మీద విమాన ప్రయాణం అంటే బస్టాండులో బస్సుల స్థాయికి దిగజారిపోయినట్లుంది.