మహిళను లేపుకెళ్లాడనీ... కుటుంబ సభ్యులను చెట్టుకు కట్టేసి చితకబాదారు

Webdunia
గురువారం, 16 మే 2019 (12:48 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ యువకుడు చేసిన వెధవపనికి అతని కుటుంబ సభ్యులందరినీ అనేక మంది కలిసి చెట్టుకు కట్టేసి చితకబాదారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ధార్ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన ముఖేష్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి గ్రామ శివార్లలో నివశిస్తున్నాడు. 
 
ఈ మహిళకు అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆ తర్వాత ఆమెను వదిలి ఉండలేని ఆ యువకుడు ఆమెను లేపుకెళ్లాడు. విషయం తెలుసుకున్న ముఖేష్.. భార్యకు, ఆ యువకుడుతో ఫోనులో మాట్లాడి... సమస్యను చర్చించి పరిష్కరించుకుందామని చెప్పి గ్రామానికి రప్పించారు. 
 
ఆపై ఆ యువకుడుతో పాటు అతని కుటుంబ సభ్యులను పట్టుకుని తన స్నేహితుల సాయంతో చెట్టుకు కట్టేసి చితకబాదాడు. దీన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఆ వెంటనే పోలీసులకు సమాచారం చేరింది. దీంతో ఘటనా స్థలికి చేరుకుని, గాయాలతో బాధితులను ఆసుపత్రికి తరలించారు. నిందితులపై పోస్కో సహా ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేసి కొందరిని అరెస్టు చేయగా, మరికొందరి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments