Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలిఫోర్నియాలో సిద్ధూ మూసేవాలా హత్య కేసు నిందితుడి అరెస్టు

Webdunia
శుక్రవారం, 2 డిశెంబరు 2022 (10:28 IST)
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాబ్ గాయకుడు, రాజకీయ నేత సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన సూత్రధారిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. కాలిఫోర్నియాలో ఆయన్ను అరెస్టు చేసినట్టు భారత నిఘా వర్గాలు వెల్లడించాయి. 
 
గత మే 29వ తేదీన సిద్ధూ మూసేవాలా హత్యకు గురయ్యాడు. వీఐపీ కల్చర్‌కు ముగింపు పలికే క్రమంలో పంజాబ్ ప్రభుత్వం సిద్ధూకు భద్రతను ఉపసంహరించుకుంది. ఆ మరుసటి రోజే ఆయన హత్యకు గురయ్యాడు. ఇది కలకలం రేపింది. సిద్ధూకు నలుగురు భద్రతా సిబ్బంది ఉండగా, ఇద్దరిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. 
 
అయితే, సిద్ధూకు బుల్లెట్ ఫ్రూఫ్ కారు ఉన్నప్పటికీ తన స్నేహితులతో కలిసి సాధారణ వాహనంలో బయటకు రావడంతో అప్టికే ఆయన కోసం వేచివున్న దండగులు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ హత్యకు ప్రధాన కుట్రదారుగా పోలీసులు భావించిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ నిఘా వర్గాల కన్నుగప్పి విదేశాలకు పారిపోయాడు. ఇపుడు ఎట్టకేలకు కాలిఫోర్నియాలో అరెస్టు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

ఆ కోలీవుడ్ దర్శకుడుతో సమంతకు రిలేషన్? : దర్శకుడు భార్య ఏమన్నారంటే...

OTT: ఓటీటీ వచ్చాక థియేటర్లు చనిపోయాయి : నిర్మాత గణపతి రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments