Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరింతగా క్షీణించిన హనుమంతప్ప.. దేశవ్యాప్తంగా ప్రార్థనలు

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2016 (10:55 IST)
మంచు గడ్డల కింద చిక్కుకుని ఆరు రోజుల తర్వాత కొనఊపిరితో బయటపడిన లాన్స్‌నాయక్‌ హనుమంతప్ప ఆరోగ్యం మరింతగా విషమించింది. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని.. మెదడుకు తగినంత ప్రాణవాయువు సరఫరా కావట్లేదని సీటీ స్కాన్‌ ద్వారా తెలిసిందని ఆర్మీ రిసెర్చ్‌ అండ్‌ రిఫరల్‌ హాస్పిటల్‌ ఒక మెడికల్ బులెటిన్‌లో వెల్లడించింది. 
 
ఆస్పత్రికి తీసుకువచ్చినప్పటి నుంచీ ఆయన వెంటిలేటర్‌పైనే ఉన్నట్టు అందులో పేర్కొంది. నిమోనియాతో ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని.. వైద్యులు ఎంతగా కృషిచేసినా, అత్యుత్తమ చికిత్సలు అందించినా శరీరంలోని కీలక అవయవాలు పనిచేయట్లేదని, క్రమంగా ఆరోగ్యం క్షీణిస్తోందని వివరించింది. అయినప్పటికీ ఆ వీరజవాన్‌ ప్రాణాలను కాపాడేందుకు ఆస్పత్రి వైద్య బృందం అనుక్షణం శ్రమిస్తోంది. అంతర్జాతీయ స్థాయి చికిత్సను సైతం అందిస్తోంది. 
 
మరోవైపు... ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అరూప్‌ రాహా బుధవారం ఆర్‌ఆర్‌ ఆస్పత్రికి వచ్చి హనుమంతప్పను చూశారు. ఆయన ఆరోగ్యం ఎలా ఉందంటూ వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హనుమంతప్ప బతకాలని ప్రార్థిస్తున్నట్టు ఒడిసా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ట్వీట్‌ చేశారు. క్లిష్టవాతావరణ పరిస్థితుల్లో రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టి హనుమంతప్పను బతికించేందుకు ఆర్మీ చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు.  

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments