దారుణం... బిస్కెట్ తీసుకున్నందుకు బాలుడిని చంపేశాడు...

Webdunia
మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (20:33 IST)
కిరాణా వస్తువులు కొనుగోలు చేయాలని వచ్చి బిస్కెట్‌ని దొంగిలించాడన్న కారణంతో బాలుడిని దారుణంగా కొట్టి చంపేశారు. బీహార్‌లోని బాంకా జిల్లాలో ఈ దారుణం జరిగింది. జిల్లాలోని బాసుదేవ్‌పూర్ గ్రామంలో సురేఖా మండ‌ల్‌కు కిరాణా దుకాణం ఉంది. ఇక్కడకి 7వ తరగతి చదువుకుంటున్న నితీష్ కుమార్ (14) ఏవో వస్తువులు కొనుగోలు చేయడానికి వచ్చాడు. 
 
ఈ నేపథ్యంలో రూ. 5 విలువ చేసే బిస్కెట్ ప్యాకెట్‌ని బాలుడు తీస్తూ ఉండగా యజమాని గమనించి పట్టుకున్నాడు. బిస్కెట్ దొంగతనం చేస్తావా అని ఆరోపిస్తూ కొట్టడం ప్రారంభించాడు. దాంతో బాలుడు స్పృహ కోల్పోయాడు. తీవ్ర గాయాలైన నితీష్‌ని చుట్టుప్రక్కల వారు గమనించి జవహర్ లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు. 
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసారు. తన కుమారుడిని కొట్టడమే కాకుండా విషం కూడా పెట్టారని బాధితుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments