Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో దారుణం : కోడలు ఉరేసుకుంటే.. వీడియో తీసిన అత్తామామలు!

Webdunia
బుధవారం, 14 ఏప్రియల్ 2021 (13:59 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కోడలు ఉరేసుకుంటే అత్తామామలు వీడియో వీడియో తీశారు. ఈ అత్మహత్యకు తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేందుకు స్మార్ట్ ఫోనులో వీడియో తీసినట్టు చెబుతున్నారు. అనంత‌రం ఆన్‌లైన్‌లో దానిని అప్‌లోడ్ చేశారు.
 
క‌ళ్ల ముందే కోడ‌లు చ‌నిపోతున్నా క‌నిక‌రం లేకుండా వారు పాల్ప‌డ్డ చ‌ర్య ప‌ట్ల తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని ముజఫర్‌ డాటియానా గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. కోమల్ అనే అమ్మాయితో ఆశిష్ అనే అబ్బాయికి 2019లో వివాహం జరిగింది. ఆ స‌మ‌యంలో కోమల్ తల్లిదండ్రులు క‌ట్నంగా ఐదు లక్షల రూపాయలను న‌గ‌దు, ఒక బైక్‌ని ఇచ్చారు.
 
అయిన‌ప్ప‌టికీ ఇంకా క‌ట్నం కావాల‌ని ఆరు నెలలుగా ఆశిష్ త‌ల్లిదండ్రులు కోడ‌లిని వేధిస్తున్నారు. అద‌న‌పు క‌ట్నం తీసుకురాక‌పోతే ఇంటి నుంచి వెళ్లిపోవాలని ఆశిష్‌తో క‌లిసి ఆమెను వేధింపుల‌కు గురి చేస్తున్నారు. దీంతో కోమల్ ఇటీవల పుట్టింటికి వెళ్లిపోయింది. 
 
గ్రామ‌ పెద్దలు ఆమెకు నచ్చజెప్పడంతో తిరిగి తన అత్తవారింటికి వచ్చింది. ఆమెను అత్తమామలు మళ్లీ  వేధించడంతో త‌ట్టుకోలేక‌పోయిన ఆమె గ‌దిలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఆమెను ఆప‌కుండా, ఆ దృశ్యాల‌ను కిటికీలో నుంచి చిత్రీకరించిన అత్తామామ‌ల‌ను పోలీసులు అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments