Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాకింగ్ న్యూస్... ఇంద్రాణిపై తండ్రి లైంగిక దాడి... ఇంద్రాణికి అతడికి కలిగిన బిడ్డే షీనానా...?

Webdunia
శుక్రవారం, 28 ఆగస్టు 2015 (20:38 IST)
షీనా బోరా హత్య కేసు గంట గంటకో మలుపు తిరుగుతోంది. ఇంద్రాణి ముఖర్జియా జీవితంలో చీకటి కోణాలు మామూలుగా ఉన్నట్లు లేవు. ఆమె జీవితం చిన్నప్పట్నుంచే గతుకలమయంగా సాగినట్లు మెల్లమెల్లగా అర్థమవుతోంది. తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం ఇంద్రాణి ముఖర్జీయా తల్లిదండ్రుల మధ్య రేగిన మనస్పర్థల కారణం ఇంద్రాణి తల్లి భర్తను వదిలేసి, భర్త సోదరుడిని వివాహం చేసుకుందనీ, దాంతో చిన్నప్పుడే ఇంద్రాణి తల్లితోపాటే అక్కడకు వెళ్లిందని తెలుస్తోంది. 
ఫేస్ బుక్ ఫోటో
 
ఐతే, తన తండ్రి కాని తండ్రి.. ఉపేంద్ర బోరా ఇంద్రాణిపై లైంగిక దాడికి పాల్పడినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆ దాడి అనంతరం ఆమె అక్కడి నుంచి కోల్ కతా వెళ్లిపోయింది. అతడి వల్లనే షీనా బోరా కలిగినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందువల్లనే ఆమె షీనా బర్త్ సర్టిఫికేట్లో ఆమె తల్లిదండ్రుల పేర్లుగా తన తల్లిదండ్రుల పేర్లను ఎక్కించినట్లు అనుమానిస్తున్నారు. 
 
ఇంద్రాణిపై లైంగిక దాడి నిజమేనంటూ ఆమె కుటుంబంతో సన్నిహితంగా ఉన్నవారు కూడా చెపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు షీనా బోరాకు సంబంధించిన పుర్రె, ఎముకలు ఈరోజు ముంబైలో ఆమెను హత్య చేసిన స్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబుకు పంపారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు