Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నాచెల్లెళ్ళట.. ప్రేమించుకున్నారట.. నగ్నంగా నడి వీధుల్లో నడిపించిన గ్రామ పెద్దలు

ఓ గ్రామ పంచాయతీ పెద్దలు మానవత్వానికి మాయని మచ్చలా నిలిచిపోయేలా తీర్పునిచ్చింది. ప్రేమించుకున్న పాపానికి ఓ ప్రేమ జంటను నగ్నంగా నడివీధుల్లో నడిపించారు. సభ్యసమాజం తలదించుకునే ఈ దారుణాన్ని కొందరు వీడియో త

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2017 (12:24 IST)
ఓ గ్రామ పంచాయతీ పెద్దలు మానవత్వానికి మాయని మచ్చలా నిలిచిపోయేలా తీర్పునిచ్చింది. ప్రేమించుకున్న పాపానికి ఓ ప్రేమ జంటను నగ్నంగా నడివీధుల్లో నడిపించారు. సభ్యసమాజం తలదించుకునే ఈ దారుణాన్ని కొందరు వీడియో తీయడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా పోస్టు చేశారు. ఒక్కసారిగా వైరల్ అయింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు... ఆ వీడియో వైరల్ కాకుండా అడ్డుకోవడమే కాకుండా ఇందుకు కారణమైన వారిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
రాజస్థాన్‌లోని గిరిజన జిల్లా బన్‌స్వారాలో శంబూపురా గ్రామానికి చెందిన ఇద్దరు యువతీయువకులు ప్రేమించుకున్నారు. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించన్న భయంతో 25 రోజుల క్రితం సరిహద్దు రాష్ట్రమైన గుజరాత్‌కు పారిపోయి పెళ్లి చేసుకున్నారు. దీనిపై పోలీసులకు కేసు పెట్టకుండా... స్వయంగా గ్రామపెద్దలే రంగంలోకి దిగి ఆ జంట కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 
 
ఎలాగోలా ఈ ప్రేమ జంటను కనిపెట్టిన పెద్దలు గ్రామానికి తీసుకొచ్చి... వరుసకు వీరిద్దరూ అన్నాచెల్లెళ్లు అవుతారు. అలాంటిది ప్రేమించుకుని గ్రామం విడిచి పారిపోయారు. వీరిద్దరికీ దుస్తులు విప్పి... వీపుపై కొడుతూ నగ్నంగా నడివీధుల్లో నడిపించాలంటూ గ్రామ పెద్ద తీర్పునిచ్చారు. దీంతో గ్రామస్తులంతా కలిసి ఆపని చేశారు. 
 
ఈ ఘటన తాలూకునూ ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. ఇది వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... ఇరువైపుల ఇద్దరి తండ్రులతో పాటు మరో ఇద్దరిని అరెస్టుచేశారు. తీవ్ర గాయాలైన సదరు యువకుడికి చికిత్స అందిస్తున్నామనీ... యువతి తమ సంరక్షణలోనే ఉంచారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Dhawan: సమంత, కీర్తి సురేష్‌‌లకు కలిసిరాని వరుణ్ ధావన్.. ఎలాగంటే?

Game Changer: 256 అడుగుల ఎత్తులో రామ్ చరణ్ కటౌట్.. హెలికాప్టర్ ద్వారా పువ్వుల వర్షం

Pushpa-2: పుష్పపై సెటైరికల్ సాంగ్: టిక్కెట్‌లు మేమే కొనాలి.. సప్పట్లు మీకే కొట్టాలి...(video)

Pawan Kalyan Daughter: తండ్రి పవన్‌కు తగ్గ తనయ అనిపించుకున్న ఆద్య కొణిదెల (video)

డ్రింకర్ సాయి హీరో ధర్మ పర్ఫామెన్స్‌కు ఆడియన్స్ ఫిదా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

తెలుగు పారిశ్రామికవేత్త శ్రీ మోటపర్తి శివ రామ వర ప్రసాద్ ప్రయాణాన్ని అందంగా వివరించిన “అమీబా”

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

తర్వాతి కథనం