Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వు జయలలిత-శోభన్ బాబు కొడుకువా? అబద్ధమని తేలితే కుళ్లబొడుస్తారు... కోర్టు ఫైర్

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణించిన తర్వాత ఆమె కుమార్తెనంటూ, కుమారుడినంటూ ఇటీవల కొందరు వ్యక్తులు ఫోటోలు పట్టుకుని తిరుగుతున్నారు. ఆమధ్య తనే జయలలిత కుమార్తెనంటూ ఓ యువతి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తమిళనాడులోని ఈరోడ్ కు చెందిన కృష్ణమూర్తి అనే

Webdunia
శుక్రవారం, 17 మార్చి 2017 (14:15 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణించిన తర్వాత ఆమె కుమార్తెనంటూ, కుమారుడినంటూ ఇటీవల కొందరు వ్యక్తులు ఫోటోలు పట్టుకుని తిరుగుతున్నారు. ఆమధ్య తనే జయలలిత కుమార్తెనంటూ ఓ యువతి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తమిళనాడులోని ఈరోడ్ కు చెందిన కృష్ణమూర్తి అనే వ్యక్తి తను జయలలిత-శోభన్ బాబుకు పుట్టిన కొడుకునంటూ వచ్చాడు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయడమే కాకుండా శుక్రవారం నాడు ఏకంగా మద్రాస్ హైకోర్టు మెట్లెక్కేశాడు. 
 
తను జయ-శోభన్ బాబు కుమారుడినంటూ కోర్టుకు చెప్పడంతో అతడిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిన్ను చూస్తే జయలలిత-శోభన్ బాబు కొడుకులా వున్నావా..? అసత్యపు సర్టిఫికేట్లు పట్టుకుని వచ్చి అబద్ధాలు చెబితే అవి నిరూపితమయితే పరిస్థితి తీవ్రంగా వుంటుందనీ, జైలు శిక్ష పడుతుందని హెచ్చరించింది. ఐనప్పటికీ అతడు వెనక్కి తగ్గలేదు. 
 
కావాలంటే డీఎన్ఎ పరీక్షకు కూడా సిద్ధమని అన్నాడు. పోయెస్ గార్డెన్ తో సహా జయలలిత ఆస్తులన్నీ తనకే దక్కాలనీ, తనకు న్యాయం చేయాలని ప్రాధేయపడ్డాడు. దీనితో మరింత ఆగ్రహం చెందిన కోర్టు... వెంటనే అతడి సర్టిఫికెట్లు, ఇంతకాలం అతడు ఎక్కడ నివాసమున్నాడన్న వివరాలన్నీ కోర్టుకు సమర్పించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments