Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోదీ కారణంగా చెడిపోయిన పెళ్లి... గుడిలో నుంచి ఎవరిదారిన వాళ్లెళ్లిపోయారు...

కొన్నేళ్లుగా ప్రేమించుకుంటూ గుడిలో పెళ్లి చేసుకుందామని కలుసుకున్న ప్రేమజంట కాస్తా నరేంద్ర మోదీ కారణంగా విడిపోయారు. పెళ్లి రద్దు చేసుకుని ఎవరిదారిన వాళ్లెళ్లిపోయారు. ఈ పెళ్లి చెడిపోవడానికి ప్రధానమంత్రి ప్రత్యక్ష కారణం కాదు కానీ పరోక్షంగా కారణమయ్యారు.

Webdunia
బుధవారం, 12 జులై 2017 (17:49 IST)
కొన్నేళ్లుగా ప్రేమించుకుంటూ గుడిలో పెళ్లి చేసుకుందామని కలుసుకున్న ప్రేమజంట కాస్తా నరేంద్ర మోదీ కారణంగా విడిపోయారు. పెళ్లి రద్దు చేసుకుని ఎవరిదారిన వాళ్లెళ్లిపోయారు. ఈ పెళ్లి చెడిపోవడానికి ప్రధానమంత్రి ప్రత్యక్ష కారణం కాదు కానీ పరోక్షంగా కారణమయ్యారు. వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ వ్యాపారికి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఓ మహిళతో ప్రేమ కుదిరింది. ఈ ప్రేమని పెళ్లిగా మార్చుకోవాలని గుడికి వెళ్లారు.
 
పెళ్లి చేసుకునేముందు ఇద్దరిమధ్యా మాటామంతి చోటుచేసుకుంది. ముచ్చట్లు చెప్పుకుంటూ ఆర్థిక పరిస్థితి గురించి చర్చ మొదలుపెట్టారు. ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుతూ వుండగా అది కాస్తా నరేంద్ర మోదీపైకి వెళ్లింది. దీనితో ఒకరు నరేంద్ర మోదీ నిర్ణయాలను సపోర్ట్ చేయగా మరొకరు విభేదించారు. ఈ విషయంలో ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగి చివరికి గొడవయ్యింది. దీనితో తమ అభిప్రాయాలు ఇప్పుడే కలవడంలేదు కనుక ఇక భవిష్యత్తులోనూ ఏమాత్రం కుదరదని ఇద్దరూ ఆ పెళ్లిని రద్దు చేసుకుని గుడి నుంచి వెళ్లిపోయారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments