Webdunia - Bharat's app for daily news and videos

Install App

"మహా" ప్రతిష్టంభన : రాష్ట్రపతి పాలన దిశగా కేంద్రం అడుగులు

Webdunia
సోమవారం, 4 నవంబరు 2019 (13:29 IST)
మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొంది. ఈ నెల పదో తేదీలోపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉంది. అంటే పదోతేదీలోపు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయాల్సివుంది. లేనిపక్షంలో రాష్ట్రపతిపాలన విధించే అవకాశాలు ఉన్నాయి. 
 
ఈ నేపథ్యంలో సోమవారం మహారాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఢిల్లీకి వెళ్లారు. ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. అయితే, భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఉపశమనం కలిగించేలా నిధులు ఇవ్వాలని కోరడానికే అమిత్ షాను కలిసినట్లు బీజేపీ నేతలు అంటున్నారు.
 
మరోవైపు, సోమవారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ కూడా సమావేశంకానున్నారు. ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. 56 సీట్లు గెలుచుకున్న శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వస్తే మద్దతు ఇచ్చే అంశంపై చర్చించనున్నారు. 
 
మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పదవీకాలాన్ని 50-50 ఫార్ములా ప్రకారం పంచుకోవాలంటూ బీజేపీ ముందు శివసేన డిమాండ్ పెట్టిన విషయం తెలిసిందే. దీనికి బీజేపీ నిరాకరిస్తోంది. ఈ నేపథ్యంలో తమకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని శివసేన పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments