Webdunia - Bharat's app for daily news and videos

Install App

భయపడటానికి నేనేమైనా భాజపా ఎంపీనా... 25 సార్లు చెప్పుతో కొట్టా... సేన ఎంపీ

శివసేన అనగానే శరీరంలో రక్తం ఉరుకులూ పరుగులూ తీస్తుందా...? ఏమోగానీ ఆ పార్టీకి చెందిన ఎంపీ రవీంద్ర గౌక్వాడ్ పుణె విమానాశ్రయంలో నానా హంగామా సృష్టించారు. తనకు కేటాయించిన సీటు విషయంపై ఎయిర్ ఇండియా సిబ్బందితో గొడవకు దిగారు. విరవరణ ఇస్తున్న 60 ఏళ్ల ఎయిర్ ఇం

Webdunia
గురువారం, 23 మార్చి 2017 (17:21 IST)
శివసేన అనగానే శరీరంలో రక్తం ఉరుకులూ పరుగులూ తీస్తుందా...? ఏమోగానీ ఆ పార్టీకి చెందిన ఎంపీ రవీంద్ర గౌక్వాడ్ పుణె విమానాశ్రయంలో నానా హంగామా సృష్టించారు. తనకు కేటాయించిన సీటు విషయంపై ఎయిర్ ఇండియా సిబ్బందితో గొడవకు దిగారు. విరవరణ ఇస్తున్న 60 ఏళ్ల ఎయిర్ ఇండియా అధికారిని చెప్పుతో కొట్టారు. 
 
ఒకటిరెండుసార్లు కాదు... ఏకంగా 25 సార్లు చెప్పుతో కొట్టారు. ఈ విషయం ఆయనగారే మీడియాకు కూడా ఎలాంటి సిగ్గూఎగ్గూ లేకుండా చెప్పేశారు. ఎయిరిండియా అధికారి తన పట్ల దురుసుగా ప్రవర్తించారనీ, అందువల్లనే అతడిని చెప్పుతో కొట్టినట్లు సమర్థించుకున్నారు. అంతేకాదు... అవతలి వ్యక్తి ఏదిబడితే అది మాట్లాడితే మౌనంగా ఉండటానికి తనేమీ భాజపా ఎంపీని కాదనీ, శివసనే ఎంపీనంటూ హూంకరించారు. కాగా గైక్వాడ్ దాడిపై ఎయిర్ ఇండియా సిబ్బంది ఆందోళనకు దిగారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments