Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఎంపీ ఎన్నిసార్లు టికెట్ బుక్ చేస్తే అన్ని సార్లూ కేన్సిల్ చేయండి: ఎయిర్ ఇండియా ఆదేశం

తన సీనియర్ స్టాప్‌ను విమానంలోనే 25 సార్లు చెప్పు దెబ్బలు కొట్టిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌పై ఇప్పటికీ కోపం తగ్గని ఎయిర్ ఇండియా సంస్థ అతడు తాజాగా బుక్ చేసిన రెండు విమాన టిక్కెట్లను రద్దు చేసి పడేసింది. ముంబై నుంచి ఢిల్లీకి ఎఐ 806 విమానంలో బుధవారం

Webdunia
బుధవారం, 29 మార్చి 2017 (04:13 IST)
తన సీనియర్ స్టాప్‌ను విమానంలోనే 25 సార్లు చెప్పు దెబ్బలు కొట్టిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌పై ఇప్పటికీ కోపం తగ్గని ఎయిర్ ఇండియా సంస్థ అతడు తాజాగా బుక్ చేసిన రెండు విమాన టిక్కెట్లను రద్దు చేసి పడేసింది. ముంబై నుంచి ఢిల్లీకి ఎఐ 806 విమానంలో బుధవారం ప్రయాణం కోసం రవీంద్ర బుక్ చేసిన టిక్కెట్‌ను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. 
మళ్లీ బుధవారం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లడానికి ఏఐ 551 విమానంలో సీటుకోసం ప్రయత్నించగా ఎయిర్ ఇండియా సంస్థ దాన్ని కూడా కేన్సల్ చేసిపడేసింది. గైక్వాడ్ కోసం బుక్ చేసిన ఈ రెండు టికెట్లు ఓపెన్ టికెట్లు కావడం విశేషం. తమ విమానాల్లో ప్రయాణించే అర్హత లేదని ప్రకటించిన ఎయిర్ ఇండియా ఇతర విమాన సంస్థలను కూడా ప్రభావితం చేసి శివసేన ఎంపీపై కసి తీర్చుకున్న విషయం తెలిసిందే. 
 
మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ నుంచి శివసేన ఎంపీ కోసం బుక్ చేసిన ఎన్ని టిక్కెట్లనయినా సరే రద్దు చేయాలని ఎయిర్ ఇండియా తన కాల్ సెంటర్లన్నింటికీ ఆదేశం జారీ చేసింది. దీంతో గత్యంతరం లేని శివసేన ఎంపీ మంగళవారమే ముంబై-న్యూ ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైలులో తనకోసం టికెట్ బుక్ చేసినట్లు మీడియా తెలిపింది. ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో నిలిచి ఉన్న రైలు కోట్ ఏ3 బోగీకి అంటించిన రిజర్వేషన్ చార్టులో ఆ ఎంపీ పేరు ఉండటాన్ని మీడియా ప్రసారం చేసింది. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments