Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయాలను దూరం పెట్టి.. చైనాను తరిమికొడదాం... శివసేన పిలుపు

Webdunia
ఆదివారం, 28 జూన్ 2020 (10:20 IST)
సరిహద్దుల్లో చైనా బలగాల హద్దుమీరి చర్యలపై శివసేన స్పందించింది. ఇపుడు రాజకీయాలను పక్కనబెట్టి... చైనా బలగాలను తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరం కలిసి కట్టుగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చింది. 
 
తూర్పు లడఖ్‌లోని గాల్వన్‌లోయ వద్ద చైనా సైన్యం పాల్పడుతున్న దుందుడుకు చర్యలపై శివసేన పార్టీ తన అధికారిక పత్రిక సామ్నాలో ఓ కథనం ప్రచురించింది. డ్రాగన్‌ దేశాన్ని ఎదుర్కొనే విషయంపై రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు మాట్లాడాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడింది. 
 
ముఖ్యంగా, లడఖ్ ప్రాంతంలో చైనా నిర్మాణాలు చేపట్టిందని, అరుణాచల్, సిక్కిం సరిహద్దుల నుంచి చైనా సైనికులు ప్రవేశిస్తున్నారని పేర్కొంది. దేశంలోని రాజకీయ విరోధులు సైతం ఒక్కటి కావాల్సిన సమయం వచ్చిందని శివసేన కోరింది. డ్రాగన్ దేశంతో పోరాటం చేయాలని, అన్ని పార్టీల నేతలు దీనిపై మాట్లాడాలని తెలిపింది.
 
సరిహద్దులో ఉద్రిక్తతలపై చైనా మాటలు ఒకలా ఉన్నాయని, చేతలు మరోలా ఉన్నాయని, సరిహద్దుల వద్ద యుద్ధ ట్యాంకులను మోహరించిందని తెలిపింది.  యుద్ధం చేయడానికి సిద్ధంగా లేని చైనా ఆ వాతావరణాన్ని మాత్రం సృష్టించి, ఇండియాను సమస్యల్లోకి నెట్టాలని యత్నిస్తోందని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments