Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్ను చంపాలని డ్రగ్ ఇచ్చింది.. మిఖాయిల్ :: షీనా కూతురేనని చెప్పింది .. పీటర్

Webdunia
శనివారం, 29 ఆగస్టు 2015 (13:20 IST)
షీనా బోరా కంటే తనను చంపాలని తన తల్లి ఇంద్రాణి ముఖర్జియా ప్లాన్ వేసి, తనకు శీతలపానీయంలో మత్తుమందు కలిపి ఇచ్చిందని కుమారుడు మిఖాయిల్ బోరా వెల్లడించాడు. అలాగే, షీనా బోరా తన కుమార్తె అని తనకు ఎపుడో ఇంద్రాణి చెప్పిందంటూ మూడో భర్త పీటర్ ముఖర్జియా తాజాగా వెల్లడించారు. షీనా బోరా హత్య కేసు ఇపుడు దేశ వ్యాప్తంగా సంచలనమైన విషయం తెల్సిందే. ఈ కేసులో తవ్వేకొద్దీ కొత్తకొత్త నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. 
 
తాజాగా మిఖాయిల్ బోరా పోలీసుల విచారణలో సరికొత్త విషయాలు వెల్లడించారు. షీనాను హత్య చేసిన రోజు మిఖాయిల్ కూడా ముంబైలోనే ఉన్నాడని, ఆరోజే కొడుకును కూడా హత్య చేయాలని ఇంద్రాణి పథకం వేసిందని పోలీసులు తేల్చారు. షీనా పెళ్లి విషయం మాట్లాడేందుకు తనను ముంబైలోని ఇంటికి ఆమె పిలిపించిందని, తనకు మత్తుమందు కలిపిన పానీయం ఇచ్చారని విచారణలో మిఖాయిల్ వెల్లడించాడు. 
 
దాన్ని తాగగానే తల తిరిగినట్టు అనిపించిందని, అదే సమయంలో షీనాను తీసుకువచ్చేందుకు తన తల్లి, సంజీవ్ ఖన్నాలు వెళ్లారని తెలిపాడు. పీటర్ ముఖర్జియా విదేశాల్లో ఉన్న సమయంలో షీనాకు వివాహమంటూ పిలవడం, ఖన్నా ఇంట్లో ఉండటంతో అనుమానం వచ్చి, తాను ఇంటి నుంచి పారిపోయినట్టు వెల్లడించాడు. ఇదే విషయాన్ని వారి డ్రైవర్ రాయ్ కూడా అంగీకరించాడని పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి. 
 
ఇదిలావుండా, తన సొంత కూతురు షీనా బోరాను హత్య చేసిన కేసులో పోలీసుల రిమాండ్‌లో ఉన్న ఇంద్రాణి ముఖర్జియా మూడో భర్త పీటర్ ముఖర్జియా మరో కొత్త విషయాన్ని వెల్లడించారు. షీనా తన సొంత కూతురే అని ఇంద్రాణి తనతో ఎప్పుడో చెప్పిందని సరికొత్త ట్విస్ట్ ఇచ్చారు. అంతకుముందు, తన కుమరుడు రాహుల్ ముఖర్జియా (పీటర్ తొలి భార్య సంతానం)కు షీనాతో సంబంధం ఉందని పీటర్ తెలిపిన సంగతితెలిసిందే. షీనా తల్లి ఇంద్రాణియే అని రాహుల్ తనతో అన్నాడని... అయితే ఈ విషయాన్ని ఇంద్రాణి కొట్టి పారేసిందని... షీనా తన చెల్లెలు అనే చెప్పిందని ఇంతకు ముందు పీటర్ చెప్పారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments