Webdunia - Bharat's app for daily news and videos

Install App

విషపు ఇంజెక్షన్‌తో షీనా బోరాను ఇంద్రాణి చంపేసిందా? పోలీసులేమంటున్నారు?

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2015 (18:35 IST)
దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా భావిస్తున్న హతురాలి తల్లి ఇంద్రాణి ముఖర్జియా నుంచి ముంబై పోలీసులు నిజాలను ఒక్కొక్కటిగా కక్కిస్తున్నారు. పైగా ఇంద్రాణి, ఆమె రెండో మాజీ భర్త సంజీవ్ ఖన్నాలు ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకుంటూ తాము చేసిన తప్పులను వారికి వారే బహిర్గతం చేసుకుంటున్నారు. 
 
అయితే, ఇంద్రాణి వద్ద జరిగిన విచారణలో కొన్ని విషయాలను పోలీసులు రాబట్టినట్టు తెలుస్తోంది. షీనా బోరా కేవలం ప్రేమ వ్యవహారం కారణంగా హత్యకు గురైనట్టు ఇప్పటివరకు భావిస్తూ వచ్చారు. కానీ, ఇపుడు సరికొత్త కోణం కూడా వెలుగులోకి వచ్చింది. ఆస్తితో పాటు ఆర్థిక లావాదేవీలు కూడా ఆమె హత్యకు కారణంగా ఉన్నాయని ముంబై పోలీసులు చెపుతున్నారు. 
 
తల్లి ఆస్తిలో షీనా భాగం కోరడంతో పాటు.. షీనా జీవించివుంటే విధి (ఇంద్రాణి - సంజీవ్ ఖన్నాల కుమార్తె) ఆస్తి దక్కదన్న అక్కసుతోనే సంజీవ్‌ ఖన్నా, ఇంద్రాణి ముఖర్జీ కలిసి షీనాను చంపి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ హత్యను కారులో చేసినట్టు తెలుస్తోంది. షీనా బోరాకు ఇంద్రాణి విషపు ఇంజక్షన్ ఇచ్చి చంపిందని ముంబై పోలీసులు అంటున్నారు. షీనా చనిపోయిన తర్వాత ఇంద్రాణి తలదువ్వి.. లిప్‌స్టిక్ సెంట్ కొట్టింది. 
 
పైగా, ఇంద్రాణి ముఖర్జియాకు డబ్బు పిచ్చి బాగా ఉన్నట్టు చెపుతున్నారు. ఇంద్రాణి రహస్య బ్యాంకు ఖాతాలు నిర్వహించిందని తెలుసుకున్న పీటర్ ముఖర్జియా బిత్తరపోయారు. అందుకే షీనా బోరా హత్య కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత ఆమెకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు. అయితే, ముంబై పోలీసులు మాత్రం ఆయన వద్ద కూడా విచారణ జరుపుతున్నారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments