Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశిథరూర్-సునందా పుష్కర్ ఇద్దరూ తెగ తిట్టుకునేవారు... నళిని

Webdunia
గురువారం, 24 జులై 2014 (17:30 IST)
తిరువనంతపురం పార్లమెంటు సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ మూడో భార్య సునందా పుష్కర్ అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిన విషయమే. సునంద పుష్కర్ సహజంగా మరణించలేదనే అనుమానాలు అప్పట్లోనే పెద్దఎత్తున వ్యక్తమయ్యాయి. సునంద శవాన్ని పోస్టుమార్టం చేసిన డాక్టర్ కూడా సునంద పుష్కర్ మరణం సహజ మరణంగానే చెప్పాలని అప్పటి యుపీఎ ప్రభుత్వం తనమీద వత్తిడి తెచ్చారని వాదనలు వచ్చాయి.
 
కాగా కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్, ఆయన సతీమణి సునంద పుష్కర్‌ల మధ్య మనస్పర్థలు ఉన్న మాట నిజమేనని ప్రముఖ జర్నలిస్టు నళిని సింగ్ వెల్లడించారు. అంతేకాకుండా, థరూర్, సునందల మధ్య ఉన్న కొన్ని రహస్యాలను సైతం బహిర్గతం చేశారు. చనిపోవడానికి ముందు కొన్ని రోజులుగా సునంద, థరూర్ వ్యవహార సరళిపై తీవ్ర మనస్థాపం చెందారని నళిని వెల్లడించారు. అంతేగాక, చనిపోవడానికి ముందు తెల్లవారుజామున ఉదయం 4 గంటల దాకా లీలా హోటల్ గదిలో వారిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగిందని, దీనిని హోటల్ సిబ్బంది కూడా ధృవీకరించినట్లు ఆమె పేర్కొన్నారు. 
 
పాకిస్థానీ జర్నలిస్టు మెహర్ తరార్ పట్ల థరూర్ ఆకర్షితమవుతున్న తీరు పట్ల తనతో సునంద పలుమార్లు మాట్లాడిందని నళిని చెబుతున్నారు. తరార్‌ను పెళ్లి చేసుకునేందుకు థరూర్ పచ్చజెండా ఊపాడని, దీనికి ఆయన కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఉందని సునంద ఆవేదన వ్యక్తం చేసిందన్నారు.
 
అంతేగాక తరార్, థరూర్‌లు కొన్ని రొమాంటిక్ మెసేజ్‌లను కూడా పంచుకున్నారని ఆమె వాపోయిందని తెలిపారు. ఆ తరహా మెసేజ్‌లలో ఓ దానిలో థరూర్, తనకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నట్లు ఉండగా, మరోదానిలో థరూర్ లేకుండా తాను ఉండలేనని తరార్ ప్రేమ ఒలకబోసిన వైనాన్ని చూసినట్లు సునంద తెలిపిందన్నారు. ఈ విషయాలను సునంద స్వయంగా తనతో చెప్పి బాధపడిందని నళిని పేర్కొన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments